Mahindra-Tata- M Evs: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ vs టాటా నెక్సాన్ ఈవీ vs ఎంజీ విండ్సర్ ఈవీ.. ఇందులో ఏది బెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra-Tata- M Evs: మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 13.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). పెట్రోల్–డీజిల్ వెర్షన్‌గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న XUV 3XO, 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 1.8 లక్షల అమ్మకాలు నమోదు చేసింది. తాజాగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోనూ ఇదే తరహాలో అమ్మకాలు సాగించాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ ఈవీకి నేరుగా పోటీగా నిలుస్తోంది. అలాగే ఎంజీ విండ్సర్ ఈవీకి కూడా ఇది గట్టి ప్రత్యర్థిగా మారనుంది. ఈ మోడల్‌తో మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత బలోపేతం చేస్తోంది.
READ MORE: Wife Killed Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు
Also Read
- Tata Osprey SUV: టాటా Osprey SUV లాంచ్.. 120 PS పవర్, DCT గేర్‌బాక్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
- Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
XUV 3XO EVలో 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది సుమారు 310 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే సుమారు 285 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. టాటా నెక్సాన్ ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. ఒకటి 30 కిలోవాట్ అవర్, మరొకటి 45 కిలోవాట్ అవర్. ఈ కారు గరిష్టంగా 489 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని టాటా వెల్లడించింది. ఎంజీ విండ్సర్ ఈవీకి 38 కిలోవాట్ అవర్, 52.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీతో ఈ కారు సుమారు 449 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ఎంజీ చెబుతోంది. ధరల విషయానికి వస్తే, మహీంద్రా XUV 3XO EV ప్రారంభ వేరియంట్ AX5 ధర రూ. 13.89 లక్షలు. టాప్ వేరియంట్ AX7L ధర రూ. 14.96 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు, ఫీచర్లు, బ్రాండ్ నమ్మకంతో XUV 3XO EV భారత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా.
తాజావార్తలు
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!