Toyota Urban Cruiser EV: టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. తన తొలి ఎలక్ట్రిక్ కారు అయిన అర్బన్ క్రూయిజర్ ఈవీని త్వరలోనే విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన తొలి టీజర్‌ను టయోటా విడుదల చేసింది. జనవరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్ మారుతి సుజుకి ఈ-విటారా ఆధారంగా రూపొందించిన రీబ్యాడ్జ్ వెర్షన్‌గా ఉండనుంది. మారుతి–టయోటా భాగస్వామ్యంలో ఇప్పటికే గ్లాంజా, రూమియన్, టైసర్ వంటి విజయవంతమైన మోడళ్లు వచ్చిన సంగతి తెలిసిందే. అదే భాగస్వామ్యంలో ఇది మరో ముఖ్యమైన అడుగు వేశారు.
READ MORE: 9000mAh బ్యాటరీ, 165Hz ఓరియంటల్ స్క్రీన్తో OnePlus Turbo 6 లాంచ్ ఫిక్స్
టీజర్‌ను చూస్తే, గత ఏడాది ఆటో ఎక్స్‌పోలో చూపించిన కాన్సెప్ట్ మోడల్‌కు చాలా దగ్గరగా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ-విటారా ఆకృతికి టయోటా ప్రత్యేక డిజైన్ టచ్ జోడించారు. ముందు భాగంలో ‘ఐబ్రో’ స్టైల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, పియానో బ్లాక్ గ్రిల్, బలమైన బోనెట్ డిజైన్‌తో కారుకు మస్క్యులర్ లుక్ ఇచ్చారు. ఇంటీరియర్‌ను ఇంకా అధికారికంగా చూపించలేదు. అయితే డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, ఫీచర్లు ఈ-విటారాకు దగ్గరగా ఉండనున్నాయని అంచనా. రెండు స్పోక్‌ల స్టీరింగ్ వీల్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.1 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంది. భద్రత పరంగా పలు ఎయిర్‌బ్యాగ్స్, ప్యానోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. బ్యాటరీ విషయంలో కూడా ఈ-విటారాతో సమానమైన ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. 49 కిలోవాట్ అవర్, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌లను అందించనున్నారు. పెద్ద 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని మారుతి వెల్లడించింది. కాగా.. మార్కెట్లోకి వచ్చిన తర్వాత టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీకి హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, అలాగే మారుతి సుజుకి ఈ-విటారా నుంచి పోటీ ఎదురుకానుంది.
READ MORE: Lung Research Center: ఐఐటీ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ లంగ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం