Indian Army: భారతీయ సైన్యం షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అవివాహిత పురుష, మహిళా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 2026 అక్టోబర్‌లో ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA)లో శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. 2026 అక్టోబర్ 1 నాటికి వయస్సు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 అక్టోబర్ 1 నుంచి 2006 సెప్టెంబర్ 31 మధ్య జన్మించినవారు అర్హులు.
READ MORE: Story Board: రాజకీయ కుటుంబాల్లో గొడవలకు కారణమేంటి..? ఉత్తరాది, దక్షిణాది ఎక్కడైనా ఇదే తీరా..?
ఎంపికైన వారికి లెఫ్టినెంట్ హోదాలో షార్ట్ సర్వీస్ కమిషన్ మంజూరు చేస్తారు. శిక్షణ కాలంలో లెఫ్టినెంట్‌కు వర్తించే పూర్తి జీతభత్యాలు అందుతాయి. PCTA శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత లెఫ్టినెంట్ ర్యాంక్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఖరారు అవుతుంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఒక సంవత్సరం యాంటీ డేట్ సీనియారిటీ కూడా ఇవ్వబడుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు పురుష అభ్యర్థులకు ఫిబ్రవరి 5 కాగా, మహిళా అభ్యర్థులకు ఫిబ్రవరి 4గా నిర్ణయించారు. జీతభత్యాల విషయానికి వస్తే, లెఫ్టినెంట్‌కు నెలకు రూ.56,100 నుంచి ప్రారంభమై హోదా పెరిగే కొద్దీ పెరుగుతాయి. కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్ స్థాయిల వరకు జీతాలు వర్తిస్తాయి. అత్యున్నత హోదా అయిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌కు నెలకు రూ.2.50 లక్షల స్థిర జీతం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు [www.joinindianarmy.nic.in](http://www.joinindianarmy.nic.in) వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ ‘Officer Entry Appln/Login’ ఎంపికపై క్లిక్ చేసి ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం డ్యాష్‌బోర్డ్‌లో ‘Apply Online’ ఎంపికను ఎంచుకోవాలి. షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కోర్సు వద్ద ‘Apply’పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపి సమర్పించాలి.
READ MORE: Motorola Edge 50 Pro Price Cut: అమెజాన్‌లో సూపర్ డీల్.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై 13 వేల తగ్గింపు!