Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కెనడాలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. సోమవారం కెనడా కొలంబియాలోని దర్శన్ సింగ్ సహాసి (66) ఇంటి వెలుపల జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ ఫేస్బుక్ పోస్ట్‌లో పోస్ట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సైతం విడుదల చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు గోల్డీ ధిల్లాన్ ఈ రెండు సంఘటనలకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. వ్యాపారవేత్త దర్శన్ సింగ్ పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల…
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. అరైవల్స్ వద్ద వదిలివేసిన బ్యాగ్‌ను గుర్తించిన సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగ్ కారణంగా కొంతసేపు ఎయిర్‌పోర్ట్‌లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించింది. తనిఖీల అనంతరం బ్యాగ్‌లో ఎలాంటి ప్రమాదకర పదార్థాలు లేవని తేలింది.
Brazil Police Operation: బ్రెజిల్ లోని రియో డి జనీరోలో రెడ్కమాండ్ ముఠాపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసు జరిపిన ఈ ఆపరేషన్ లో కనీసం 64 మంది మరణించారు. రియో డి జనీరో ప్రాంతంలో మంగళవారం సుమారు 2,500 మంది పోలీసులు, సైనికులు.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాపై దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో 81 మంది అనుమానితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ దాడి సమయంలో పోలీసులకు, స్మగ్లింగ్ ముఠా సభ్యులకు మధ్య జరిగిన కాల్పుల్లో…
Holidays: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని తీర జిల్లాలు సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
Chennai Tragedy: చెన్నై దారుణం చోటు చేసుకుంది.. స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడంతో మనోవేదనకు గురైన కేంద్ర ప్రభుత్వ అధికారి తన కుమారుడిని చంపి... ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై అన్నానగర్ లోని ఓ అపార్ట్మెంట్లో నవీన్ కణ్ణన్ కుటుంబం ఉంటోంది. నవీన్ తేనాంపేటలోని కేంద్ర భద్రతా విభాగ కార్యాలయంలో సీనియర్ ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య నివేదిత(35), కుమారుడు లవిన్(7) ఉన్నారు. నివేదిత దక్షిణ రైల్వే ఉద్యోగిని. వారితో పాటు నవీన్ తల్లిదండ్రులు ఉంటున్నారు. గదిలోంచి…
Heavy Rains: హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడి, ఈశాన్య దిశగా కదులుతున్న ‘మొంథా’ తుఫాన్ అర్ధరాత్రి తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ తుఫాన్ ప్రభావం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. హైదరాబాద్ సహా అనేక జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.
Montha Cyclone: తెలంగాణపై మొంథా తుఫాన్ ఎఫెక్ట్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. మొంథా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో భారీ.. అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది.. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.. కొమరం భీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, నాగర్…
KCR: మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ ఈ రోజు తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా హరీష్‌రావు ఇంటికి చేరుకున్నారు. తన బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మకు ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి హరీష్‌రావుని కౌగిలించుకుని ఓదార్చారు.
Amazon Layoffs 2025: ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం, ఈసారి సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను లేఆఫ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో దాదాపు 3.5 లక్షల కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 10 శాతం మందిని తొలగించేందుకు నిర్ణయించిందని సమాచారం. మొత్తం కంపెనీ ఉద్యోగుల సంఖ్య…
MP Arvind Slams Kavitha: జాగృతి అధ్యక్షురాలు కవిత పై ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత నడుస్తోందని ఆరోపించారు. అసలు కవిత ఎవరు..? జాగృతి ఎంటి..? అని ప్రశ్నించారు. కవిత వేధింపుల భయానికి గతంలో కాంట్రాక్టర్లు పారిపోయారన్నారు. జాగృతి జనం బాట యాత్ర తీహార్ జైలుకు వెళ్తుందని.. మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కవిత అనుకున్న ఆశయం నెరవేరుతుందన్నారు.