The Raja Saab Day1 Collections: ప్రభాస్ స్టార్‌డమ్.. రాజా సాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Raja Saab Day1 Collections: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన స్టార్ పవర్‌ను నిరూపించాడు. తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ దిశగా దూసుకెళ్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారత్‌లో తొలి రోజు సుమారు రూ. 65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు అంచనా. ఇందులో ప్రధాన వాటా తెలుగు రాష్ట్రాలదే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కనీసం రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రీమియర్ షోల ద్వారానే రూ. 8 కోట్లకు మించి ఆదాయం రావడం గమనార్హం.
READ MORE: Trump-Greenland: గ్రీన్‌లాండ్ కావాలంటే ఇలా చేయండి.. వైరల్‌గా మారిన ట్రంప్‌కు కొత్త ప్రతిపాదన
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
విదేశీల్లోనూ ‘ది రాజా సాబ్’ అద్భుతంగా రాణించింది. ఓవర్సీస్‌లో 25 నుంచి 30 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.90 కోట్లను దాటినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల తుది లెక్కలు వెలువడితే రూ. 100 కోట్ల మార్క్ దాటుతుందా లేదా అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓపెనింగ్ డే కోసం ముందస్తు బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు కావడం విశేషం. భారత్‌లో టికెట్ బుకింగ్స్ మరింత ముందుగానే ప్రారంభించి ఉంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ, ప్రభాస్ ఇటీవల వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’ స్థాయిలో కాకపోయినా అడ్వాన్స్ సేల్స్ బలంగానే నమోదయ్యాయి. క్రిటిక్స్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినా, తొలి రోజు ఈ స్థాయిలో ఓపెనింగ్ సాధించడానికి పూర్తిగా ప్రభాస్ స్టార్‌డమ్‌నే కారణమని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!