Ramachander Rao: సోమనాథ్ జీవిత చరిత్ర యువతకు ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూత ఏడాది బీజేపీ డైరీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ప్రతి ఏడాది బీజేపీ రాష్ట్ర కార్యాలయ పీఆర్వో పరమేశ్వర్ డైరీకి శ్రీకారం చుడుతున్నారు.. బీజేపీ తరుపున పరమేశ్వర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏడాది బీజేపీ డైరీ ఆవిష్కరణ జరుగుతుంది.. డైరీ అనేది నిత్య జీవన చర్య అన్నారు. అనంతరం.. మహమ్మద్ గజిని దాడులలో ధ్వంసమైన సోమనాథ్ దేవాలయం గురించి మాట్లాడారు. సోమనాథ్ ఆలయం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాభిమాన్ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.. సోమనాథ్ జీవిత చరిత్ర యువతకు ఆదర్శం కావాలన్నారు.
జీ రామ్ జీ పాలసీ ద్వారా ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు.. గత పాలసీ కంటే మెరుగైన ఫలితాలు జీ రామ్ జీ పాలసీలో ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. “కాంగ్రెస్ జీ రామ్ జీ పాలసీపై అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.. బీజేపీని బద్నాం చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుంది.. రేషన్ షాపుల్లో 5 కిలోల బియ్యం ఎవరిస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలి..? కేంద్రం ఇచ్చే బియ్యంపై ప్రధాని మోదీ బొమ్మ లేకుండా చేస్తున్నారు.. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.. రేషన్ కార్డ్ ల మీదా, రేషన్ రిసిప్ట్ ల మీదా.. రేషన్ బ్యాగుల మీద మోడీ బొమ్మ పెట్టాలి.. రేషన్ షాపుల్లో బియ్యం రేవంత్ రెడ్డి, ఇందిరా గాంధీ, భట్టి విక్రమార్క లు ఇస్తున్నారా..?భేషరతుగా రేషన్ బ్యాగులపై మోదీ బొమ్మ ముద్రించాలి, లేదంటే ఆ వివక్ష మీదా ప్రత్యేక పోరాటాలు నిర్మిస్తాం.. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి జల వివాదాలు పరిష్కరించుకోవాలి..జల వివాద సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి.. కేంద్ర ప్రభుత్వానికి రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళ లాంటివి.. ఏ రాష్ట్రం మీదా కేంద్ర ప్రభుత్వానికి వివక్ష ఉండదు..” అని ఎన్. రామచందర్ రావు స్పష్టం చేశారు.
READ MORE: Jayakrishna : ఘట్టమనేని జయకృష్ణ.. ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!