Komatireddy Venkat Reddy: మొంథా తుఫాను ఎఫెక్ట్ తో ఆర్ అండ్‌బీ రోడ్లు 334 లోకేషన్స్‌లో 230 కి.మీ దెబ్బతిన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రోడ్లు భవనాలు శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. తాజాగా తుఫాన్ ఎఫెక్ట్స్‌పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి మాట్లాడారు. నిన్న అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.. దెబ్బతిన్న, కోతకు గురైన రోడ్లు, బ్రిడ్జిలు, కాజ్‌వేల తాత్కాలిక పునరుద్ధరణకు […]
CP Sajjanar: వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. రేపటి నుంచి అన్ని ఆడియో వీడియో వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. జనాలకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్లు పర్యవేక్షిస్తామని, కాల్స్ రికార్డు చేస్తామని ఓ పోస్ట్‌లో తప్పుడు వార్తను షేర్ చేశారు. ఈ అంశంపై తాజాగా సీపీ సజ్జనార్ స్పందించారు. తన ఫొటోతో ముద్రించిన ఈ నకిలీ పోస్ట్‌పై సీరియస్ అయ్యారు. వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నానంటూ చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు.. ఇలాంటి…
Droupadi Murmu: పాక్ తప్పుడు ప్రచారాలకు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెక్ పెట్టేశారు. బుధవారం రాఫెల్ ఫైటర్ జెట్‌లో 30 నిమిషాల పాటు విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌తో కలిసి ఫొటో దిగారు. గతంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని.. ఆ విమాన పైలట్ శివాంగి సింగ్‌ను యుద్ధ ఖైదీగా అదుపులోకి తీసుకున్నమని దాయాది దేశం తప్పుడు వార్తలు వ్యాప్తి చెందేలా చేసింది. ఈ వార్తలపై…
Nara Lokesh: మొంథా తుఫానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో రెండో రోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు.. మొంథా తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు మంత్రి నారా లోకేష్..
Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎం నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం నిత్యావసరాలను సమకూర్చిందని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు.
Montha Cyclone: తెలంగాణకు అతి సమీపంలో మొంథా తుఫాన్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ వైపు తుఫాన్ కదులుతుందని వెల్లడించింది.. మధ్యాహ్నంలోపు ఉమ్మడి ఖమ్మం జిల్లాను తాకనుంది మొంథా.. రాబోయే 6-12 గంటల్లో వాయుగుండంగా లేదా తీవ్ర వాయుగుండంగా మారనుంది. వాయుగుండంగా మారుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుంది..
Montha Cyclone: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్రభావం రెండో రోజు సైతం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అనేక రైళ్లు రద్దు చేశారు.మొత్తం 122 రైళ్లు పూర్తిగా రద్దు చేయగా.. 14 రైళ్లు దారి మళ్లించారు. 28 రైళ్లు రీ-షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాక్‌పై భారీగా చేరిన వరద నీటిని తొలగించేందుకు రైల్వే…
Pakistan: పాకిస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అక్కడి పౌరులలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోగ్రాముకు రూ.600కి చేరింది. ఇది దాదాపు 400% పెరుగుదలను సూచిస్తుంది. ఈ పరిస్థితులు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. తాజాగా ఈ సమస్య పార్లమెంటులో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. టమాటాలు కొనడానికి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంపీలు వ్యంగ్యంగా స్పందించారు.
Hyderabad Rains: మొంథా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో డతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, మలక్‌పేట్ మెట్రో స్టేషన్ పరిసరాలు పూర్తిగా నీటమునిగాయి. దిల్సుఖ్నగర్ నుంచి మలక్‌పేట్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయమయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్‌లు అక్కడికి చేరుకుని డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రం చేస్తూ నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యాయి. మన్హోల్స్ తెరిచి వరద నీరు వేగంగా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు…
Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హన్మకొండ, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజ్గిరి, నాగర్‌కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్ష సూచన జారీ…