Bengaluru: బెంగళూరుకు చెందిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) రిటైర్డ్ అధికారికి చెందిన హృదయ విదారక సోషల్ మీడియా పోస్ట్ వేలాది మందిని కదిలించింది. తన ఏకైక కుమార్తె మరణంతో బాధతో అల్లాడిపోయిన ఆయన.. అడుగడుగునా లంచాలు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని పేరు కె. శివకుమార్. BPCL మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా పరిచయం చేసుకున్నారు. అయితే.. తన 34 ఏళ్ల కుమార్తె అక్షయ మరణించింది. గోల్డ్‌మన్ సాచ్స్‌లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన అక్షయ, 11 సంవత్సరాలు…
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య ఇప్పటికే సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన అశాంతి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాల్లో నిలిచింది. పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా, ఆఫ్ఘనిస్థాన్ పాక్ దళాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. తాజాగా రెండు దేశాలు ఇప్పటికీ దీర్ఘకాలిక కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తాలిబన్లు లష్కరే తోయిబా శిబిరంలో పెరిగిన ఓ చొరబాటుదారుడిని అరెస్టు చేశారు.
Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వానికి అందిన వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరంగల్ జిల్లాలో పంట నష్టం చోటు చేసుకోగా, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ రైతులు భారీగా నష్టపోయారు. తుఫాను కారణంగా ప్రధానంగా వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Director SS Rajamouli attended the Baahubali Epic re-release premiere: బాహుబలి.. భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన సినిమా. ఎపిక్’ పేరుతో బాహుబలి మొదటి భాగంతో పాటు రెండో భాగాన్ని మిక్స్ చేసి రాజమౌళి రీ-రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎపిక్ పేరుతో మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. నిజానికి ఈ మధ్యకాలంలో రీ-రిలీజ్ సినిమాలతో పోలిస్తే, ఈ…
Fake Pregnant Job Scam: పూణేకు చెందిన 44 ఏళ్ల కాంట్రాక్టర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను చూశాడు. అది అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ వీడియోలో ఒక మహిళ లోతైన స్వరంతో "నన్ను తల్లిని చేసే పురుషుడు కావాలి. నేను అతనికి 2.5 మిలియన్ రూపాయలు(రూ.25 లక్షలు) ఇస్తాను. అతని కులం, రంగు లేదా విద్యతో నాకు పట్టింపు లేదు "అని చెబుతోంది. ఈ వీడియోను " గర్భిణీ ఉద్యోగం " అనే పేజీలో పోస్ట్ చేశారు. ఆ కాంట్రాక్టర్ మొదట్లో…
Mahabubabad: మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బతికే ఉన్న వ్యక్తిని మార్చురీలో భద్రపరిచింది వైద్య సిబ్బంది. సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మార్చురీలో ఉంచి తాళం వేశారు. ఉదయం మార్చురీ శుభ్రం చేస్తున్న స్వీపర్ గమనించి సూపర్వైజర్ రాజుకు సమాచారం ఇచ్చాడు. ఆయన వెంటనే ఔట్‌పోస్ట్ పోలీసులకు తెలియజేయగా, టౌన్ ఎస్సై వచ్చి ఆ వ్యక్తిని మార్చురీ నుంచి బయటకు తీసి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆ వ్యక్తి జయ్యారం…
CM Revanth Reddy: తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని, పశువులకు ఆపద రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన సహాయం అందించాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత…
Kavitha: మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెండు రోజుల క్రితం హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కవిత అంత్యక్రియలకు హాజరుకాలేదు. దీనితో హరీష్‌రావుతో ఉన్న విభేదాల కారణంగానే రాలేదని అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే మూడు రోజుల తర్వాత, గురువారం ఉదయం కవిత హరీష్‌రావు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను కలుసుకున్నారు.
Hyderabad: ప్యారడైజ్ నుంచి డైరీ ఫార్మ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. బాలంరాయి నుంచి డెయిరీఫామ్ వరకు 5.04 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద 600 మీటర్ల మేర సొరంగమార్గం నిర్మించనున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ రన్ వేకు ఎలాంటి ఆటంకం లేకుండా భారీ టన్నెల్ నిర్మాణం చేపడతారు. బోయిన్పల్లి జంక్షన్ వద్ద రెండు వైపులా 248 మీటర్ల నుంచి 475 మీటర్ల పొడవు, 8 మీటర్ల పొడవుతో ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేస్తారు. ఎలివేటెడ్…
Bandi Sanjay Kumar: ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, సిబ్బంది ధైర్యంగా పోరాడాలని పిలపునిచ్చారు. 6 గ్యారంటీలు ఇస్తామని ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? మాట తప్పిన కాంగ్రెస్ నేతలపై విజిలెన్స్ దాడులు చేస్తారా?