Silver Price vs Bikes: బంగారం, వెండిని చాలామంది సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అయితే కాలక్రమంలో వాటి ధరలు ఆశ్చర్యకరంగా పెరుగుతున్నాయి. 2020 జనవరిలో కిలో వెండి ధర సుమారు 42 వేల రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే వెండి ధర ఢిల్లిలో కిలోకు దాదాపు రూ. 2.68 లక్షలకు చేరింది. అంత డబ్బు వెండిపై ఖర్చు చేయడం కన్నా, అదే డబ్బుతో ఒక మంచి బైక్ కొనుగోలు చేసి జీవితాన్ని ఆస్వాదించొచ్చన్న ఆలోచన ఇప్పుడు చాలామందిలో యువతలో వస్తోంది. వెండి కంటే తక్కువ ధరలో లభించే, రైడింగ్ అనుభూతిని ఇచ్చే ఐదు బైక్‌ల గురించి చూద్దాం.
READ MORE: Avika : ప్రెగ్నెన్సీ వార్తలపై అవికా గోర్ రియాక్షన్.. ‘అదంతా అబద్ధం.. అసలు విషయం వేరే ఉంది’
1. KTM Duke 250
KTM డ్యూక్ 250 స్టైల్‌తో పాటు పనితీరులోనూ అద్భుతంగా ఉంటుంది. నగరంలో ట్రాఫిక్ మధ్య సులభంగా నడిపించవచ్చు, హైవేల్లోనూ మంచి ఫీల్ ఇస్తుంది. దీన్ని వెండితో పోలిస్తే దాదాపు 56 వేల రూపాయలు మిగులుతాయి. ఆ డబ్బుతో మంచి హెల్మెట్, గ్లోవ్స్ కొనచ్చు.
KTM డ్యూక్ 250 స్పెక్స్:
డిస్ప్లేస్మెంట్: 248.8 cc
పవర్: 30 Hp
టార్క్: 24 Nm
గేర్బాక్స్: 6-స్పీడ్
ధర: రూ. 2.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)
2. Bajaj Pulsar NS400Z
బజాజ్ పల్సర్ NS400Z ఇప్పటివరకు వచ్చిన పల్సర్ బైక్‌లలో అత్యంత శక్తివంతమైనది. మస్క్యులర్ లుక్, బలమైన ఇంజిన్‌తో మంచి విలువ ఇస్తుంది. దీని ధర వెండితో పోలిస్తే సుమారు 80 వేల రూపాయలు తక్కువ. రైడింగ్ గేర్‌తో పాటు చిన్న ట్రిప్‌కు సరిపడే మొత్తం మిగులుతుంది.
బజాజ్ పల్సర్ NS400Z స్పెక్స్:
డిస్ప్లేస్మెంట్: 373 cc
పవర్: 42 Hp
టార్క్: 35 Nm
గేర్బాక్స్: 6-స్పీడ్
ధర: రూ. 1.92 లక్షలు (ఎక్స్-షోరూమ్)
3. Hero Xpulse 210
హీరో ఎక్స్‌పల్స్ 210 అడ్వెంచర్ ప్రేమికులకు సరైన ఎంపిక. ఆఫ్‌రోడ్ రైడింగ్, లాంగ్ టూరింగ్‌కు ఇది బాగా పనికొస్తుంది. వెండితో పోలిస్తే లక్ష రూపాయలకుపైగా మిగులుతాయి. ఆ డబ్బుతో బ్యాగులు, బూట్లు తీసుకుని అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేయొచ్చు.
హీరో ఎక్స్‌పల్స్ 210 స్పెక్స్:
డిస్ప్లేస్మెంట్: 210 cc
పవర్: 24.6 Hp
టార్క్: 20.7 Nm
గేర్బాక్స్: 6-స్పీడ్
ధర: రూ. 1.62 లక్షలు
4. Yamaha R15
యమహా R15 యువతలో ఎంతో పాపులర్ అయిన స్పోర్ట్స్ బైక్. స్టైలిష్ లుక్, ట్రాక్ ప్రేరణతో రూపొందించిన పనితీరు దీనికి ప్రత్యేకత. దీని ధర వెండి కంటే దాదాపు లక్ష రూపాయలు తక్కువ. ఆ డబ్బుతో రేసింగ్ జాకెట్, ట్రాక్ డే అనుభవం పొందవచ్చు.
యమహా R15 స్పెక్స్:
డిస్ప్లేస్మెంట్: 155 cc
పవర్: 18.4 Hp
టార్క్: 14.2 Nm
గేర్బాక్స్: 6-స్పీడ్
ధర: రూ. 1.66 లక్షలు (ఎక్స్-షోరూమ్)
5. Kawasaki KLX 230
కావాసాకి KLX 230 మట్టిరోడ్లపై దూసుకెళ్లే బైక్‌లను ఇష్టపడేవారికోసం తయారైంది. తక్కువ బరువు, బలమైన నిర్మాణంతో ఆఫ్‌రోడ్ రైడింగ్‌కు చక్కగా సరిపోతుంది. వెండితో పోలిస్తే సుమారు 80 వేల రూపాయలు మిగులుతాయి. భద్రతా పరికరాలు, ట్రెయిల్ యాక్సెసరీస్ కొనడానికి ఆ మొత్తం సరిపోతుంది.
కవాసకి KLX 230 స్పెక్స్:
డిస్ప్లేస్మెంట్: 233 cc
శక్తి: 19 Hp
టార్క్: 19 Nm
గేర్బాక్స్: 6-స్పీడ్
ధర: రూ. 1.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)