యూపీలోని హత్రాస్‌లో తొక్కిసలాట, వంద మందికి పైగా మరణించిన కేసు మంగళవారం సుప్రీంకోర్టు ముందు ప్రస్తావనకు రానుంది. ఈ పిటిషన్ ను సీజేఐ డీవై చంద్రచూడ్ ముందు ప్రస్తావించనున్నారు. సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించాలని కోరారు. ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షణ విచారణ జరపాలని ఈ పిటిషన్‌లో డిమాండ్ చేశారు. హత్రాస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. కార్య నిర్వహకుడు మధుకర్. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఏకైక నిందితుడు ఇతడే. హత్రాస్‌లో తొక్కిసలాటలో 121 మంది మరణించిన కేసులో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్‌ను శుక్రవారం అరెస్టు చేశారు.
READ MORE: Terrorists Attack: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి..ఆరుగురు జవాన్ల వీరమరణం…
జనంపై విషపు స్ప్రే చల్లారు…
హత్రాస్ తొక్కిసలాట కేసులో భోలే బాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ.. హత్రాస్ సత్సంగ్ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు గుంపుపై విషపు స్ప్రే చల్లారని, దాని కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అన్నారు. ఈ ఘటనలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని భోలే బాబా ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాత మరోసారి భోలే బాబా తరుపున ఆయన న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్రాస్ తొక్కిసలాట పథకం ప్రకారం జరిగిందని ఆయన ఆరోపించారు. మతమరమైన కార్యక్రమంలో 10-12 మంది వ్యక్తులు విషం చల్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని న్యాయవాది ఏపీ సింగ్ ఆదివారం పేర్కొన్నారు. తొక్కిసలాట తర్వాత కుట్ర చేసినవారు అక్కడ నుంచి పారిపోయారని అన్నారు.