నేటి రాజకీయాలలో చదువుకున్న వాళ్లకు కూడా వెలకట్టే పరిస్థితి వచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏకశిలా నగర్లో జరిగిన యూత్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర ఇంటిలో భారీగా నగదు లభ్యమైంది. ఉదయం నుంచి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 60 లక్షల రూపాయల నగదు తోపాటు పెద్ద ఎత్తున వెండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. "నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డువడ్లు పండిస్తారు. అది తెలిసే సన్న వడ్ల కు 5 వందల బొనస్ అంటూ ప్రకటన చేశారు.
బీఆర్కే భవన్ లో సీఈఓని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కలిశారు. ఈ నెల 27 వ తేదీ నల్గొండ -ఖమ్మం -వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వర్కింగ్ డే రోజు జరుగుతున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటింగ్ ఉన్నవారికి పోలింగ్ రోజు వేతనం తో కూడిన సెలువు ప్రకటించాలని వెంకట్ కోరారు.
లిక్కర్ లో ప్రభుత్వ పాలసీ ఉంటది.. కానీ అనధికార పాలసీ ఉంటదా? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. "మద్యం అందుబాటులో లేకుంటే సేల్స్ తగ్గాలి. కానీ ఎందుకు పెరిగింది సేల్స్.
రేవంత్ చిన్న వయసులో సీఎం అయ్యారు.. ఆయనకి ఇంకా చాలా రాజకీయ భవిష్యత్తు ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బీజేపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.." ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తే మాత్రం సహించరు.
పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.