యూపీలోని గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ రైలు ప్రమాదం కేసులో పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు పేలుడు శబ్ధం తనకు వినిపించిందని రైలు లోకో పైలట్ తెలిపారు. రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. ఈ క్లెయిమ్ చేసిన లోకో పైలట్ పేరు త్రిభువన్. ప్రమాదానికి ముందు తనకు పెద్ద చప్పుడు వినిపించిందని త్రిభువన్ తెలిపారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసినట్లు పేర్కొన్నారు.
READ MORE: Puja Khedkar: పూజా ఖేద్కర్ తల్లి మనోరమాపై మర్డర్ కేసు నమోదు
వాస్తవానికి.. చండీగఢ్ నుంచి గోరఖ్‌పూర్ మీదుగా అస్సాం వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా 27 మందికి పైగా గాయపడినట్లు ఇప్పటివరకున్న సమాచారం. గోరఖ్‌పూర్ రైల్వే సెక్షన్‌లోని మోతీగంజ్ సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దెబ్బతిన్న కోచ్‌లలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది.
READ MORE: Venu swamy: హీరోహీరోయిన్సే అనుకున్నాము ఇప్పుడు విలన్స్ కూడానా.. వేణుస్వామి క్రేజ్ మాములుగా లేదుగా..
రైల్వే మంత్రిత్వ శాఖ పరిహారం ప్రకటించింది
రైల్వే మంత్రిత్వ శాఖ కూడా మృతులకు, క్షతగాత్రులకు పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. సీఆర్‌ఎస్ విచారణతో పాటు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.