మారిన జీవన విధానం.. ఆహారపు అలవాట్లతో మలబద్ధకం లేదా కడుపులో గ్యాస్ చాలా సాధారణం. అయితే ఈ రెండు సమస్యలు చాలా ఇబ్బందికరమైనవి. మలవిసర్జన సమయంలో కొంతమంది తీవ్ర ఇబ్బందులను పడతారు. అయితే మలబద్ధకం సమయం బారిన పడితే నిర్లక్ష్యం వద్దు. ఇది అనేక వ్యాధులకు, ఆరోగ్య సమస్యలకు కారణంగా మారుతుంది. మలబద్ధకం ఉంటే ఆకలి తగ్గుతుంది. దానికి దూరం చేసేందుకు ఈ సూత్రాలు పాటించండి.
READ MORE: CM Chandrababu: ఇంకా దొరకని ఎంపీడీవో వెంకట రమణ ఆచూకీ.. కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్
ఉసిరికాయను తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉసిరికాయను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉసిరికాయ వేసి రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే మరిగించి చల్లారాక తాగాలి. ఉసిరి నీరు కడుపుని శుభ్రపరుస్తుంది. ప్రేగులలో పేరుకుపోయిన మలాన్ని సులభంగా తొలగిస్తుంది. త్రిఫల అనేది మూడు పదార్ధాలతో కూడిన ఆయుర్వేద రసాయన సూత్రం. త్రిఫల అనేది అమలకీ, బిభితక హరితకీ మిశ్రమం. ఇది మన పేగుల్లో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది. పేగుల్లోని మురికిని శుభ్రం చేయడంలో త్రిఫల చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే పొట్ట శుభ్రంగా ఉండి, పొట్టలో పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది.
READ MORE: dinosaur fossil: ఇంటి వెనుక తవ్వకాల్లో బయటపడ్డ డైనోసార్ ఎముకలు.. రూ.373 కోట్లకు విక్రయం
అవిసె గింజలు కరిగే , కరగని ఫైబర్ రెండింటినీ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫైబర్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల మలం మృదువుగా మారుతుంది. ఈ గింజల్లో ఉండే కరగని పీచు పేగులో కూరుకుపోయిన మలాన్ని మృదువుగా చేసి పొట్ట నుండి బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఖర్జూరాన్ని నెయ్యిలో వేసుకుని తింటే కూడా త్వరగా ఉపశమనం లభిస్తుంది. అయితే దీని కోసం మీరు ఖర్జూరాలను దేశీ నెయ్యిలో కొంత సమయం పాటు నానబెట్టాలి. ఖర్జూరంలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అదే సమయంలో, ఫైబర్ జీవక్రియను పెంచుతుంది.