వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఏడేళ్ళ శిక్ష లోపు సెక్షన్లు నమోదు అయ్యాయని.. ఇలాంటి పరిస్థితుల్లో నిందితుడు నీ టచ్ చేయవద్దని సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్పిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫు లాయర్ అన్నారు.
చెన్నైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కార్యాలయానికి బుధవారం (మే 22, 2024) రాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. దీంతో ఎన్ఐఏ ఒక్కసారిగా హైఅలర్ట్ అయింది. బెదిరింపు కాల్లో భాగంగా హిందీలో మాట్లాడిన ఓ వ్యక్తి.. ‘‘ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఓ చోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చాడు.
ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 57 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలు కూడా ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలోని ఏడు స్థానాలకు ఎన్నికల ప్రచారానికి గురవారంతో తెరపడింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ సస్పెన్షన్ పై క్యాట్ ఉత్తర్వులు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిగింది. రెండోసారి ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయటం సరికాదని ఈ నెల8 న క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ ఆదేశాలను ప్రభుత్వం అప్పీల్ చేసింది.
మంత్రి అంబటి పిటిషన్ డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు. సత్తెనపల్లిలో 4 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరపాలని అంబటి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది.
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో వర్శిటి జరిగిన దాడి ఘటనపై విచారణకు హాజరయ్యారు. అక్కడ ఆయన అధికారులతో మాట్లాడారు. "పద్మావతి వర్శిటిలో నాపై దాడికి కర్త, ఖర్మ, క్రియ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అభిమానులకు శుభవార్త. కింగ్ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా నటుడు నిన్న (బుధవారం) మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. షారుక్‌ను అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చేర్చారు.
దేశ రక్షణలో జవాన్ల పాత్ర ఎనలేనిది. సరిహద్దుల్లో ఎండా.. వాన.. చలికి సైతం తట్టుకుంటూ నిలబడతారు. మాతృభూమిని శత్రువుల దాడి నుంచి కాపాడేందుకు సైన్యం చేస్తున్న త్యాగాలు మరువలేనివి. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలా శత్రువు దాడిచేస్తాడో తెలియదు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలోని పోలింగ్ కేంద్రంలో దూరి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ1గా చేర్చారు. ఆయన గత కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో ఆయన కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు.