కౌంటింగ్ రోజున మాచర్ల వెళ్లొద్దని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం (EVM) ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోనే వచ్చే నెల 6 వరకు ఉండాలని తెలిపింది
వరివేస్తే ఉరి అన్నది మీరు కాదా.. అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్, కేసీఆర్ ను ప్రశ్నించారు. సన్నాల సాగు చేయాలని తర్వాత రైతుల నడ్డి విరిచింది మీరు కాదా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గానే జరిగిందిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కోదాడలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమేళన కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ హాజరై మాట్లాడారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ పై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బిగ్ బాస్కెట్ సంస్థలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి.. పలు లోపాలను గుర్తించారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షన్నర వరకు సొమ్ములు తీసుకుని కంబోడియాకు తీసుకెళ్లిన యువకులను ఇండియన్ ఎంబసీ సమన్వయం తో విశాఖకు తీసుకొచ్చినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యనార్ వెల్లడించారు. బాధితులు ఇంటికి చేరుకోవడానికి పోలీసు శాఖ పని చేస్తోందని తెలిపారు.
నాలుగు నెలలోనే కాంగ్రెస్ మోసం బయట పడింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ.. బస్సు తప్పా అన్ని పథకాలు తుస్సే అని విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దేశ ప్రగతి, ఉద్యోగాల గురించి మాట్లాడటం లేదని.. ముస్లిం రిజెర్వేషన్ ఎత్తేస్తామని చెబుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గతంలో అమిత్ షా మాట్లాడితేనే కోర్టులో కేసు వేశామని గుర్తుచేశారు.
ఏపీ ఛీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డితో స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియషన్ సభ్యుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధులపై చర్చ జరిగింది. పెండింగ్ నిధులు విడుదల చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ జి.లక్షీశా మాట్లాడారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఈసీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో.. అందుకు తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు.
బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పినందుకు కిషన్ రెడ్డి మాటలు స్వాగతిస్తున్నామని.. అదే జరిగితే సన్మానిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గా రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ఐనట్టున్నారు.