ఆఫ్ రోడర్స్ ఎస్‌యూవీ కార్ల తయారీలో మహీంద్రా థార్ అత్యంత పాపులర్గా నిలిచింది. ప్రస్తుతం థార్ కేవలం 3-డోర్ తో మాత్రమే అందుబాటు లో ఉంది. ఈ కార్లు విక్రయాల్లో దూసుకుపోతున్నాయి. 2023-24లో 65,246 యూనిట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో 17,286 యూనిట్ల అమ్ముడయ్యాయి. ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్లో దేశంలోనే రెండో స్థానంలో థార్ కొనసాగుతోంది. తాజాగా మహీంద్ర కంపెనీ 5 డోర్స్ మహీంద్రా థార్ ను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. నేడు ఆ నూతన కార్ కి సంబంధించి పేరు, వీడియో విడుదల చేసింది కంపెనీ..దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
READ MORE: Tummala Nageswara Rao: రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు..
మహీంద్రా మరియు మహీంద్రా థార్ 5-డోర్ల వెర్షన్‌కు “థార్ రోక్స్” అని పేరుపెట్టింది. మహీంద్రా థార్ రోక్స్ 15 ఆగస్ట్ 2024న తన ఎంట్రీని ఇవ్వబోతోందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం రోజున మహీంద్రా థార్ రాక్స్‌ను పరిచయం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కంపెనీ ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. 3-డోర్ థార్‌తో పోలిస్తే దీనికి అనేక ప్రధాన డిజైన్ అప్‌డేట్‌లు ఇవ్వబడినట్లు విడుదలైన కంపెనీ రిలీజ్ చేసిన టీజర్‌లో చూడవచ్చు. కారు ముందు భాగంలో వృత్తాకార ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడి ఉంది.
READ MORE:Bangladesh Protests: బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు 1000 మంది విద్యార్థులు.. చిక్కుకుపోయిన 4000 మంది..
మరోవైపు.. మహీంద్రా థార్ రోక్స్‌లో డ్యూయల్ పేన్ సన్‌రూఫ్, కొత్త ఇంటీరియర్ థీమ్‌తో పాటు 10.25-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా అనేక ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఎక్స్‌యూవీ300, ఎక్స్‌యూవీ700 మోడల్ కార్ల మాదిరిగా పనోరమిక్ సన్ రూఫ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) సిస్టమ్ ఉంటాయి. 5-డోర్ థార్ కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుందని సమాచారం. వాటిల్లో ఒకటి 1.5 లీటర్ల డీ117 సీఆర్డీఈ డీజిల్, 2.2 లీటర్ల ఎంహవాక్ 130 సీఆర్డీఈ డీజిల్, 2.0 లీటర్ల ఎంస్టాలియన్ 150 టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్లు ఉండనున్నాయి. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు ఉంటాయని వార్తలోస్తున్నాయి. మహీంద్రా థార్ 5-డోర్ యూనిట్ ధర రూ.12.50 లక్షల నుంచి రూ.18.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతాయని భావిస్తున్నారు.