Train Accident: వీడిన దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం మిస్టరీ..కారణం ఇదే..
- చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు
- ప్రమాదానికి మందు పెద్ద పేలుడు శబ్ధం వినిపించిందన్న లోకోపైలెట్
- రైలు ట్రాక్‌లో లోపం కారణంగా ప్రమాదం
- 2:30 గంటలకు స్టేషన్ మాస్టర్‌కు విషయం తెలిసింది
- ఈ రైలు మధ్యాహ్నం 2:28 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు
- రెండు నిమిషాల నిర్లక్ష్యం ఇంత పెద్ద ప్రమాదానికి కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించి కుట్ర లేక సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఎందుకంటే ప్రమాదం అనంతరం లోకో పైలట్‌కు సంచలన విషయం వెల్లడించారు. ప్రమాదానికి మందు పెద్ద పేలుడు శబ్ధం వినిపించిందని తెలిపారు. దీంతో ప్రమాద ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ పేలుడు శబ్ధం వెనుక మిస్టరీ వెలుగులోకి వచ్చింది. ట్రాక్ నిర్వహిస్తున్న ఉద్యోగులు ఇంజినీరింగ్ విభాగాన్ని హెచ్చరించినట్లు ఉమ్మడి నివేదికలో చెప్పబడింది. అధికారుల రెండు నిమిషాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది. రెండు నిమిషాలు నలుగురి ప్రాణాలను, మరెంతో మందిని క్షతగాత్రులను చేశాయి. ప్రభుత్వానికి కూడా భారీగా నష్టం వచ్చింది. ఎందరో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది.
READ MORE: Tirumala: రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
స్టేషన్ మాస్టర్‌కి ఆలస్యంగా హెచ్చరిక వచ్చింది..
ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం.. ఈ రైలు మధ్యాహ్నం 2:28 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరింది. అయితే 2:30 గంటలకు స్టేషన్ మాస్టర్‌కు 30 kmph వేగ పరిమితిని నిర్ధారించాలని, వేగంగా వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేయబడింది. హెచ్చరిక ఆర్డర్ ప్రకారం.. రైలు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడపకూడదు. అయితే స్టేషన్‌మాస్టర్‌కు హెచ్చరిక అందే సమయానికి రైలు ట్రాక్‌లో లోపం ఉన్న ప్రదేశానికి చేరుకుంది. 2:32 గంటలకు రైలు కోచ్‌లు పట్టాలు తప్పాయని ఉమ్మడి నివేదికలో కూడా రాశారు. రైలు 2:28కి స్టేషన్ దాటడానికి 2 నిమిషాల ముందే స్టేషన్ మాస్టర్‌కు హెచ్చరిక అందజేసి ఉంటే.. బహుశా ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని నివేదికలో స్పష్టమైంది. ట్రాక్‌లో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ట్రాక్‌లో కొంత అవాంతరాలున్నట్లు పట్టాలు తప్పినందుకు సంబంధించిన ఉమ్మడి నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. 350 మీటర్ల మేర ట్రాక్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!