DGP Shivadhar Reddy: 2016లో భరోసా సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.. ఈరోజు శంషాబాద్ లో 33వ భరోసా సెంటర్ ప్రారంభం జరిగిందని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.. మహిళలు, పిల్లలపై హింసలు జరిగితే వారికి న్యాయం చేయడానికి భరోసా సెంటర్ లు ఉన్నాయన్నారు.. తాజాగా శంషాబాద్‌లో భారోసా సెంటర్‌ను ప్రారంభించిన డీజీపీ.. ఈ సందర్భంగా ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాలు, 6 కమిషనరేట్ లలో భరోసా సెంటర్ లు ఉన్నాయని తెలిపారు.. భరోసా సెంటర్ ల నిర్వహణ, మానిటరింగ్ మొత్తం విమెన్ సేఫ్టీ…
CP Sajjanar: సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంచి సమాజ నిర్మాణం కోసం యువత పాటు పడాలన్నారు. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ ఐక్యత దినోత్సవం) జాతీయ ఐక్యత కోసం 5K RUN కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించారు. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫెక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని స్పష్టం చేశారు. డీప్ ఫెక్ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్ పెట్టామన్నారు.. సైబర్ నేరాల పట్ల ఆందోళనకు గురికావద్దని…
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ తన భార్య ఉషా వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య ఉష ఏదో ఒక రోజు తనలాగే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌లో హత్యకు గురైన రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్ జ్ఞాపకార్థం బుధవారం రాత్రి మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో జె.డి. వాన్స్ మాట్లాడారు. పరస్పర గౌరవం, అవగాహనతో మతాంతర వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆసక్తికరంగా, గతంలో దేవుడిని నమ్మని వాన్స్ క్రమంగా తన భార్య సహాయంతో…
Samineni Ramarao murder: మధిర శాసనసభ నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కలుషిత హింస రాజకీయాలకు తావు లేదు అని డిప్యూటీ సీఎం అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ఖమ్మం పోలీసు అధికారులను హెచ్చరించారు. క్లూస్ టీం, శ్రీ ఫర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి…
CM Revanth Reddy: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేడు వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు. గురువారం ఉదయమే వరద ప్రభావిత జిల్లాలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారు. ఆఖరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. ఈరోజు వాతావరణం అనుకూలించకపోవటంతో తాను రాలేకపోయానని, శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వస్తానని…
Sardar Vallabhbhai Patel: సర్దార్ వల్లభాయ్ పటేల్.. స్వాతంత్ర భారత్‌ను ఏకఘటంగా నిలబెట్టిన ఉక్కు మనిషి. స్వాతంత్య్ర సమరయోధుడు భారత తొలి ఉప ప్రధానిగా, హోమ్ మంత్రిగా దేశ స్వాతంత్య్రానంతరం స్వదేశీ సంస్థాలను భారత యూనియన్‌లో విలీనం చేసి, బర్డోలీ వీరుడు, ఇండియన్ బిస్మార్క్‌గా పేరు పొందిన వారు “సర్దార్ వల్లభాయ్ పటేల్”. ఈ మహనీయుని జన్మదినమైన అక్టోబర్ 31వ తేదీని భారత జాతి జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటున్నాం. ఈ రోజు హైదరాబాద్ సంస్థాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు సర్దార్ చేసిన కృషి,…
Uttar Pradesh Doctor Viral Audio: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు, మహిళా ఆరోగ్య కార్యకర్తకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఈ క్లిప్ ఆరోగ్య శాఖలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన లంబువా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగింది. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్.. ఒక మహిళా ఆరోగ్య కార్యకర్తతో ఫోన్లో అనుచితంగా సంభాషిస్తున్నట్లు ఆడియో ద్వారా బట్టబయలైంది.
Newlywed Woman Suicide in Vikarabad: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధి కోస్గి మండలం పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే కాటికి చేరింది. చంద్రవంచ గ్రామానికి చెందిన నవవధువు గొల్ల శ్రీలత(21) పెళ్ళైన మూడు రోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది..
Justice Surya Kant: జస్టిస్ సూర్యకాంత్ భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో విడుదల చేసిన ఆస్తుల వివరాల ప్రకారం.. జస్టిస్ సూర్యకాంత్ దేశవ్యాప్తంగా కోట్లాది విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఇళ్ళు, భూమి, ఫిక్స్డ్ డిపాజిట్లు, నగలు ఉన్నాయి. చండీగఢ్ నుంచి గురుగ్రామ్, హిస్సార్ వరకు రియల్ ఎస్టేట్ ఆస్తులు విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా.. కొత్త సీజేఐ కుటుంబం బ్యాంకు ఎఫ్‌డిలు, బంగారం, వాహనాలను కలిగి ఉంది. హిస్సార్ అనే చిన్న పట్టణం నుంచి…
Musi River: హైదరాబాద్‌లో వరుస వర్షాల తర్వాత ఉద్ధృతంగా ప్రవహించిన మూసీ నది వరద పూర్తిగా తగ్గింది. జంట జలాశయాలకు (హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్) ఇన్‌ఫ్లో తగ్గడంతో జలమండలి అధికారులు మూసీకి నీటి విడుదలను తగ్గించారు. ఉస్మాన్ సాగర్‌కు ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, కేవలం 121 క్యూసెక్కుల నీరు మాత్రమే మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్‌కు 1,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో, 339 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో నిన్న మొత్తం 6,200 క్యూసెక్కుల నీటిని మూసీలోకి…