Karimnagar: కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం రంగపేటలో వడ్ల దొంగతనం కలకలం రేపింది. రంగపేట ఐకేపీ సెంటర్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు దొంగలు వడ్ల సంచులు దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. టాటా ఏసీ వాహనంలో సుమారు 20 వడ్ల సంచులు ఎక్కిస్తున్న సమయంలో రైతులు అప్రమత్తమయ్యారు. తక్షణమే అక్కడికెళ్లిన రైతులు దొంగలను అడ్డుకున్నారు. ఆ సమయంలో ఒక దొంగను పట్టుకుని గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Ram Charan’s ‘Peddi’ Movie First Song: రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పెద్ది’ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, నిర్మాత వెంకట సతీశ్ కిలారు.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటీనటులు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేంద్ర శర్మ తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాపై తాజాగా బిగ్ అప్డెట్ వచ్చింది..
Koti Deepotsavam 2025: రచన టెలివిజన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1 నుంచి 13 వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే దీపాల పండగలో లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీపాలు వెలిగిస్తారు.
Fatty Liver: శరీరంలో ఏ భాగానికి ఎటువంటి చిన్న ఇబ్బంది కలిగినా వైద్యుల వద్దకు పరుగెత్తుతాం. అలాంటి ఒక సమస్య వస్తుందనే ఆలోచన కూడా లేకుండా ఉన్న సమయంలో శరీరంలో పెద్ద వ్యాధి ఉందనే విషయాన్ని జీర్ణం చేసుకోవడమే కష్టంగా మరుతుంది. అందుకే వీలైనంత ఆరోగ్యంగా ఉంటూ ఉండాలి. సరైన వ్యాయామం, ఆహారం విషయంలో తగినంత శ్రద్ధ కూడా అంతే అవసరం. శరీరంలో ముఖ్యమైన భాగం అయిన కాలేయం, దీని చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది ఫ్ల్యాటీ లివర్ వ్యాధిగా మారుతుంది. దీనిని కొన్ని…
Sudharshan Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆరు గ్యారంటీల అమలు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు కీలకమైన భాధ్యత లభించడం, పార్టీ అంతర్గత రాజకీయాల్లో సమతుల్యత సాధించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి పదవి ఆశించిన మరో సీనియర్ నేత ప్రేమ్ సాగర్…
Kavitha: కరీంనగర్ జిల్లాలో కవిత మొదటి రోజు పర్యటన కొనసాగుతోంది. మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మొంథా తుపాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయటం లేదు. దానికి తోడు వర్షాల కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు.
Mohammed Azharuddin: మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి వరించింది. నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మధ్యాహ్నం 12.15గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. నూతన మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఏ శాఖను కేటాయిస్తారు అనే అంశంపై క్లారిటీ లేదు.
Mamta Kulkarni: బాలీవుడ్ మాజీ నటి, ప్రస్తుతం సన్యాసినిగా జీవిస్తున్న మమతా కులకర్ణి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోరఖ్‌పూర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదం చెలరేగింది. తన మూడు రోజుల ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో మమతా మాట్లాడుతూ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముంబై పేలుళ్లకు పాల్పడలేదని, అతడు ఉగ్రవాది కాదన్నారు.
Venkaiah Naidu: పటేల్ 150 జయంతి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సర్దార్ ఒక ఉక్కుమనిషి.. పటేల్ దేశ సమైక్యత శిల్పి అని కొనియాడారు. ఆయన సంస్కరణలు దేశానికి ఆదర్శం.. దేశానికి మొదటి ప్రధాని కావాల్సిన వారని గుర్తు చేశారు. దేశంలో ఉన్న 15 రాష్ట్రాల్లో నాడు 14 రాష్ట్రాలు పటేల్ ప్రధాని కావాలని కోరాయని తెలిపారు. గాంధీ కోరిక మేరకు ప్రధాని పదవిని వదులుకున్న త్యాగశీలి పటేల్ అని చెప్పారు.…
Union Minister Kishan Reddy: ఏడాది పాటుగా పటేల్ ఉత్సవాలు జరుపుతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పటేల్ రాజకీయ నేత కాదు రైతాంగ ఉద్యమ నేత అని కొనియాడారు. తాజాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పటేల్ అంటే కాంగ్రెస్ పార్టికి నొప్పి.. పీవీ నరసింహారావు అంటే కాంగ్రెస్ కు నచ్చదన్నారు. కేవలం నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్ నచ్చుతుందని విమర్శించారు.కాంగ్రెస్ కు దేశమంటే నెహ్రూ, నెహ్రూ అంటే దేశం.. నెహ్రూ తప్ప కాంగ్రెస్ కు…