Harsha Richaria: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నివసిస్తున్న హర్షా రిచారియా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె స్వస్థలం మాత్రం ఉత్తరాఖండ్. మహాకుంభ్ 2025 సమయంలో ఆమె పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆమె తీసుకున్న కొత్త నిర్ణయం మళ్లీ సంచలనం రేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఈ భావోద్వేగ వీడియోలో హర్షా, తాను ధార్మిక మార్గం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. గత ఏడాది కాలంగా నిరంతర విమర్శలు, వ్యక్తిత్వ హననం, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నానని చెప్పారు. ఇవన్నీ భరించలేక తన పాత వృత్తిలోకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. మౌనీ అమావాస్య స్నానం పూర్తయ్యాక ధార్మిక జీవనానికి ముగింపు పలుకుతానని స్పష్టంగా చెప్పారు.
READ MORE: Indian Army Day 2026: సెల్యూట్ జవాన్! భారత సైనికులు మైనస్ 50 డిగ్రీల వద్ద ఎలా గస్తీ కాస్తారో తెలుసా?
తాను ఎలాంటి తప్పు చేయలేదని, అనైతికంగా ప్రవర్తించలేదని హర్షా పేర్కొన్నారు. అయినా అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయని, తన మనోధైర్యాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన్ని వ్యాపారంగా మార్చి కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలను ఆమె పూర్తిగా ఖండించారు. ప్రస్తుతం తాను ధనికురాలు కాదని, అప్పుల్లో ఉన్నానని చెప్పారు. ధార్మిక మార్గంలోకి రావడానికి ముందు తాను యాంకరింగ్, మోడలింగ్ రంగాల్లో మంచి కెరీర్ చేశానని హర్షా గుర్తుచేశారు. దేశ విదేశాల్లో పనిచేశానని, పూర్తిగా స్వతంత్రంగా జీవించానని తెలిపారు. కానీ గత ఏడాది వివాదాలు, వ్యతిరేకత వల్ల తన ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని చెప్పారు. ఇప్పుడు చేతిలో అప్పులే మిగిలాయని పేర్కొన్నారు. సమాజంలో మహిళల వ్యక్తిత్వంపై ప్రశ్నలు వేయడం చాలా సులభమని హర్షా బాధతో చెప్పారు. తాను సీత కాదని, మళ్లీ మళ్లీ అగ్నిపరీక్ష ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను ఈ సన్యాసి మార్గం నుంచి వెళ్లిపోవడం సాధారణంగా కాదని, తిరుగుబాటు భావంతోనే బయటకు వెళ్తానని అన్నారు.
READ MORE: BMC Elections Controversy: మహారాష్ట్ర ఎన్నికల్లో ఇంక్ వార్.. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల సంచలన ఆరోపణలు!
అయితే.. మహాకుంభ్ 2025 సమయంలో హర్షా ‘అందమైన సాధ్వి’గా గుర్తింపు పొందారు. ప్రయాగ్‌రాజ్‌లో ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువతి సాధ్విగా మారడం చాలామందిని ఆకర్షించింది. త్రివేణి సంగమం వద్ద స్నానం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆమెపై అందరి దృష్టి పడింది. ఆమె కళ్లలోని భక్తి, సంప్రదాయ దుస్తులు, పూలమాలలు ప్రజలను ఆకట్టుకున్నాయి. రెండు సంవత్సరాలుగా ధార్మిక మార్గంలో ఉన్నానని, ఆచార్య మహామండలేశ్వర శిష్యురాలినని అప్పట్లో ఆమె చెప్పారు. భౌతిక జీవితాన్ని వదిలి శాంతి కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నానని, ఇక్కడే తనకు కావాల్సిన ప్రశాంతత దొరికిందని అప్పట్లో వివరించారు. కుంభమేళాలో పాల్గొనడం తన మోక్ష మార్గంలో భాగమని చెప్పారు. అయితే తర్వాత ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అని, అసలు పేరు హర్షా రిచారియా అని వెలుగులోకి వచ్చింది. మహాకుంభ్‌తో పాటు ఇతర ధార్మిక కార్యక్రమాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కవర్ చేస్తూ ఉండేది.
READ MORE: MS Dhoni: వామ్మో.. ఈ ఏజ్‌లోనూ తగ్గని ఉత్సాహం.. ఆఫ్-రోడింగ్‌కు ఎంఎస్ ధోని, సల్మాన్
ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ప్రకారం.. హర్షా ఒక నటి, యాంకర్. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేసింది. సాధ్వి జీవితం గడుపుతున్నప్పటికీ పెళ్లిళ్లకు హోస్ట్‌గా కూడా పని చేస్తున్నట్టు ఆమె స్టోరీస్‌లో కనిపించింది. 2024 నవంబర్‌లో థాయిలాండ్‌లోని బ్యాంకాక్ సమీపంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను హోస్ట్ చేసిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మయన్మార్‌లో మరో వివాహ వేడుకను నిర్వహించినట్టు కూడా వెల్లడైంది. ఆమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలు కూడా కనిపించడంతో విమర్శలు మొదలయ్యాయి. ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను నిజమైన సాధ్విగా అంగీకరించలేదు. యాంకరింగ్, యాక్టింగ్ నేపథ్యాన్ని బయటపెడుతూ, కేవలం పేరు, గుర్తింపు కోసం సాధ్వి వేషం వేసిందని కొందరు ఆరోపించారు. ఇవన్నీ కలిసి ఇప్పుడు హర్షా తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి కారణమయ్యాయని ఆమె మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతోంది.