Priya Kapoor: రూ.30 వేల కోట్ల ఆస్తి వివాదం.. సుప్రీంకోర్టు మెట్లేక్కిన వ్యాపారవేత్త రెండో భార్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priya Kapoor: దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ రెండో భార్య ప్రియా కపూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2016లో నటి కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ మధ్య విడాకులు జరిగిన విషయం తెలిసిందే. ఈ విడాకుల కేసుకు సంబంధించిన పత్రాల ధృవీకృత ప్రతులు ఇవ్వాలని ప్రియా కోర్టును కోరారు. ఈ పత్రాల్లో విడాకుల సమయంలో కుదిరిన రాజీ వివరాలు, పిల్లల సంరక్షణ ఎలా ఉండాలనే అంశాలపై సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఇంజంక్షన్‌పై ఉత్తర్వులను రిజర్వ్ చేయడానికి మూడు రోజుల ముందు, గత నవంబర్ చివర్లో ప్రియా ఈ దరఖాస్తు దాఖలు చేశారు. ఈ కేసు రేపు విచారణకు రానుంది. విడాకుల సమయంలో కుదిరిన ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు కేవలం కరిష్మా కపూర్, సంజయ్ కపూర్‌లకు మాత్రమే తెలుసు. 2016లో ఈ కేసు విచారణ బహిరంగంగా కాకుండా న్యాయమూర్తి ఛాంబర్‌లోనే జరిగింది. ఇద్దరి సమ్మతితో స్నేహపూర్వకంగా ఈ విడాకుల ప్రక్రియ ముగిసింది.
READ MORE: MP Arvind: అవును.. శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉంది.. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
సుప్రీంకోర్టు రికార్డుల ప్రకారం.. ఇరు పక్షాలు సంతకం చేసిన ‘కన్సెంట్ టర్మ్స్’ను స్వీకరించారు. అందులో వారి ఇద్దరు పిల్లల సంరక్షణ హక్కులు కరిష్మా కపూర్‌యే చూసుకోవాలని, సంజయ్ కపూర్‌కు పిల్లలను కలిసే హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఆర్కే అగర్వాల్‌ల ధర్మాసనం ముందు ఛాంబర్‌లో జరిగిన విచారణ అనంతరం, కరిష్మా తరఫు న్యాయవాది మాట్లాడుతూ దంపతుల మధ్య ఉన్న అన్ని వివాదాలు స్నేహపూర్వకంగా పరిష్కారమయ్యాయని తెలిపారు. కాగా.. వ్యాపారవేత్త సంజయ్ కపూర్ జూన్ 2025లో మరణించారు. అయితే ఆయన మరణానంతరం ఆయన ఆస్తి విషయంలో న్యాయ వివాదాలు మొదలయ్యాయి. సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య చట్టపరమైన పోరు కొనసాగుతోంది. సంజయ్ కపూర్ మరణానంతరం ఆయన ఆస్తికి సంబంధించిన వివాదంలో కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ కపూర్‌లు కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!