TPCC Chief Mahesh Kumar Goud: రిగ్గింగు సాధ్యం అయ్యే పనే కాదు.. ఓటమి భయంతో చేసే ఆరోపణే రిగ్గింగ్ అని జూబ్లీహిల్స్ ఎన్నికలను ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఓడిపోయే వాళ్ళు సహజంగా నిందలు వేస్తారని.. ఎగ్జిట్ పోల్స్ కంటే మా కార్యకర్తల సమాచారమే మాకు కీలకమన్నారు. తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన ముచ్చటించారు. మంచి మెజారిటీ తో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు, కార్యకర్తలు బాగా పని చేశారని వారందరికీ అభినందనలు తెలిపారు. వచ్చే ప్రభుత్వం…
Sangareddy: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో భార్యను భర్త హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కేఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకట బ్రహ్మం అనే వ్యక్తి తన భార్య కృష్ణవేణిని ఈ రోజు ఉదయం బ్యాట్‌తో కొట్టి హత్య చేశాడు.. కృష్ణవేణి కోహీర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త వెంకట బ్రహ్మం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు ఇంటర్మీడియట్ చదువుతుండగా, కుమారుడు ఎనిమిదో తరగతి విద్యార్థి.
CM Revanth Reddy: 2034 జూన్ వరకు తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ కార్యకర్తను.. ఏ ఎన్నిక వచ్చిన కోట్లాడత.. నాది లీడర్ మనస్తత్వం కాదు.. క్యాడర్ మనస్తత్వం అన్నారు. డోర్ టు డోర్ కూడా తిరుగుతానని స్పష్టం చేశారు. సెక్యూరిటీ అనుమతి ఇవ్వడం లేదు కానీ.. ఇస్తే ఇల్లు ఇల్లు తిరుగుతానన్నారు. నాకు ఓపిక.. వయసు ఉందని చెప్పారు. అనంతరం సీఎం రేవంత్ బీజేపీ […]
CM Revanth Reddy: 60 వేల పైచిలుకు ఉద్యోగాలు.. 20 వేల నియామక నోటిఫికేషన్ ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.. తాజాగా నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో సీఎం ప్రసంగించారు. తలకాయలో గుజ్జు ఉన్న వారు.. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుంటారా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం పైశాచిక ఆనందం.. వెకిలి చేష్టలు ఎక్కువ అయ్యాయి.. అంత అసహనం ఎందుకు? అని ప్రశ్నించారు. “ఎవరిది డ్రగ్స్ కల్చర్.. ఇవాళ గల్లి గల్లి డ్రగ్స్.. గంజాయి దందాలు ఉన్నాయి. ఎవరు […]
BJP: తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంకు నేడు తెరపడనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి. సాయంత్రం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంక్షలు మొదలుకానున్నాయి.
CM Revanth Reddy: ప్రజాపాలన ప్రారంభమై రెండేళ్లైంది.. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.. మీట్ ది ప్రెస్‌లో సీఎం పాల్గొని మాట్లాడారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసింది.. కానీ.. రాష్ట్రం వచ్చాక ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించారన్నారు. 2004లో ఉచిత కరెంట్‌పై వైఎస్సాఆర్ మొట్టమొదటి సంతకం చేశారని గుర్తు చేశారు.. రైతు రుణమాఫీ అమలు చేసి రైతులను ఆదుకుంది..
Kerala: కేరళ రాజధాని తిరువనంతపురం తూర్పు కోటలో ఉన్న శ్రీ పద్మనాథ స్వామి ఆలయానికి సంబంధించి కీలక సమాచారం వెలువడింది. ఆలయంలో ఇటీవల బంగారం మాయమైన విషయం తెలిసిందే. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే బంగారం దొరికింది. గోల్డ్ దొరికినప్పటికీ ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారు పూత కోసం గోల్డ్ నాణేలను తీశారు. ఆ సమయంలో స్ట్రాంగ్ రూమ్‌లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని దర్యాప్తులో తేలింది.
Gujarat: ప్రధాని సొంత రాష్ట్రంలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) ఓ పెద్ద విజయాన్ని సాధించింది. చాలా కాలంగా అంతుచిక్కని ISIS-సంబంధిత ఉగ్రవాదులను ఉమ్మడి ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. ఇందులో ఒకడపై ఏడాది పాటు భద్రతా సంస్థల నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు కనుగొన్నారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు ISISతో ముడిపడి ఉన్న రెండు వేర్వేరు మాడ్యూళ్లలో భాగమని చెబుతున్నారు. ఏటీఎస్(Anti-Terrorism Squad) ఈ ఉగ్రవాదులను ఏడాది కాలంగా ట్రాక్ చేస్తోంది.
Ragging Shocks JNTU Nachupally Campus in Jagtial: చక్కగా చదువుకోమని కాలేజీలకు పంపిస్తే.. ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధింపులకు గురి చేస్తున్నారు కొందరు విద్యార్థులు.. తాజాగా జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. “ఇంట్రాక్షన్” పేరుతో సీనియర్లు జూనియర్ విద్యార్థులను వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో కాలేజీలో భయానక వాతావరణం నెలకొంది.
Bandi Sanjay: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో జరుగుతున్న జూనియర్ సీనియర్ సెలెక్షన్ల పై సీరియస్ అయ్యారు.. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించకపోవడంపై వివరాలు సేకరించారు. సెలక్షన్ కమిటీలో ఉన్న సభ్యులపైన యాక్షన్ ఉండబోతుందని హెచ్చరించారు.. రాచకొండ కమిషనర్ కి సైతం సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. సెలక్షన్ కమిటీ సభ్యులు.. హైదరాబాద్‌లో ఉన్న నైపుణ్యం లేని క్రికెటర్లకి అవకాశం కల్పిస్తూ వారి దగ్గర డబ్బులు వసూలు…