Nampally: 48 గంటలు గడవకముందే నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయ్ నగర్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ పేలి దాని నిప్పు రవ్వలు పక్కనే ఉన్న ఐటీఐ గ్రిడ్‌లో ఉన్న ఒక డెంటింగ్ పెయింట్ షాప్‌లో పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమపాక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో ఘటన స్థాసలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చారు. ఒక టొయోటా క్రిస్తా, ఒక ఫోర్డ్ ఎండివోర్ కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
READ MORE: Off The Record: కిలివేటి సంజీవయ్య వర్సెస్ రెడ్డి సామాజికవర్గ నేతలు
హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో గత శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నిచర్ షోరూమ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఒక నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. భవనం కింద ఉన్న సెల్లార్‌లోని హోల్‌సేల్ ఫర్నిచర్ షాపులో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. 22 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.. దట్టమైన పొగల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైంది. మంటల్లో చిక్కుకున్న ఐదు మృతదేహాలను గుర్తించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గుర్తించిన అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) మృతదేహాలను గుర్తించి మార్చురీకి తరలించారు. ఈ ప్రమాద ఘటన మరువక ముందే మరో ఘటన జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
READ MORE: Anil Ravipudi: నా సక్సెస్ ఫార్ములా ఇదే: డైరెక్టర్ అనిల్ రావిపూడి