Union Cabinet: ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీ పేలుళ్లను ఉగ్రవాద సంఘటనగా గుర్తించి, కేబినెట్ సమావేశంలో బాధితులకు నివాళులర్పించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని మంత్రి వర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది.
School Bus Fire: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు మొత్తం దగ్ధమైంది. అదృష్టవశాత్తూ, ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు బస్సులో లేరు. పోలీసుల సమాచారం ప్రకారం.. బస్సు డ్రైవర్ విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపి, బస్సును ఇంటి సమీపంలో పార్క్ చేశాడు. కొద్ది సేపటికే బస్సు ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడం గమనించాడు. అప్పటికే మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
Delhi Blast Case: ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తు సంస్థలు పెద్ద పురోగతి సాధించాయి. హర్యానాలోని ఖండావాలి గ్రామం సమీపంలో ఫరీదాబాద్ పోలీసులు ఎర్ర రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు (DL10CK0458)ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు హెచ్చరిక జారీ చేసిన కారు ఇదేనని పోలీసు ప్రతినిధి తెలిపారు. ఆ వాహనాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు, ఇతర కేంద్ర సంస్థలకు సమాచారం అందించారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు.
Bomb Threats: ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బిగ్ అలర్ట్ వచ్చింది. శంషాబాద్ సహా ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్‌ను పేల్చేస్తామని మెయిల్ వచ్చింది.. ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యాలయానికి మెయిల్ వచ్చింది.. ఎయిర్‌పోర్టులో తనిఖీలు నిర్వహిస్తున్నారు.. అంతే కాదు.. మరోవైపు.. ఢిల్లీ, ముంబై, చెన్నై, గోవా, తిరువనంతపురం ఎయిర్‌పోర్టుల్లో సైతం బాంబులు ఉన్నాయంటూ ఇండిగో, ఎయిర్ ఇండియా కార్యాలయాలకు మెయిల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు…
Hyderabad: శ్రీశైలం హైవే రెడ్ లైట్ ఏరియాగా మారుతోంది? హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిజ్రాల ఆగడాలు స్థానికులు, ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రహదారిపై అర్ధనగ్నంగా నిలబడి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. హిజ్రాలు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.
Delhi Bomb Blast: దేశ రాజధానిలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు దాడి తర్వాత దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలను కనుగొన్నాయి. 14 ఏళ్ల తరువాత రాజధానిలో జరిగిన అతిపెద్ద పేలుడుగా చెబుతున్నారు. అలాగే గత పార్లమెంటు దాడిలో నిందితుడు ఈ ప్రమాదంలో మరణించినట్లు కనుగొన్నారు. గతంలో నిరక్షరాస్యులపై వారు మాత్రమే ఉగ్రవాదం వైపు మొగ్గు చూపేవారని నమ్మేవాళ్లం. ప్రస్తుతం వైద్యులు, తదితర విద్యావంతులు ఉండటం గమనార్హం.
Hyderabad: టీమిండియాలో హైదరాబాద్ యువకుడు మహమ్మద్ మాలిక్‌కు అవకాశం లభించింది. అండర్-19 ఏ జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్‌గా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. నాంపల్లి మల్లెపల్లికి చెందిన ఈ యువ క్రికెటర్ వినూ మన్కడ్ ట్రోఫీలో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ టోర్నమెంట్లో మాలిక్ అత్యధిక వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
Sandeep Chakravarthi: జమ్మూకశ్మీర్ ఉగ్రకుట్ర భగ్నం కేసులో ఓ తెలుగు అధికారి కీలకంగా వ్యవహరించారు. కర్నూలుకు చెందిన సందీప్ చక్రవర్తి కేసులో మొదట లీడ్ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీనగర్ SSPగా విధులు నిర్వర్తిస్తున్నారు తెలుగు తేజం సందీప్ చక్రవర్తి.. పెహల్గాం ఎటాక్ తర్వాత చేపట్టిన మహాదేవ్ ఆపరేషన్ లోనూ కీలకంగా వ్యవహరించారు. జైషే మహమ్మద్ పోస్టర్లను మొదట గుర్తించారు. పోస్టర్లు అంటించిన వారిని సీసీ కెమెరాలు ద్వారా గుర్తించారు. ముగ్గురు నిందితులపై గతంలో స్టోన్ పెల్టింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు.
Bihar Elections 2025: భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 66.91 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఇదిలా ఉండగా, మంగళవారం(నవంబర్ 11)న జరిగిన రెండవ దశలో 68.76 శాతం పోలింగ్ నమోదైంది.
PM Modi: ప్రధాని భూటాన్ నుంచి తిరిగి వచ్చారు. దేశ రాజధానిలో అడుగు పెట్టిన వెంటనే పేలుడులో గాయపడిన వారిని పరామర్శించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఇప్పటికే దాదాపు 100 మంది ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ పేలుళ్లపై […]