Ragging Shocks JNTU Nachupally Campus in Jagtial: చక్కగా చదువుకోమని కాలేజీలకు పంపిస్తే.. ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధింపులకు గురి చేస్తున్నారు కొందరు విద్యార్థులు.. తాజాగా జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. “ఇంట్రాక్షన్” పేరుతో సీనియర్లు జూనియర్ విద్యార్థులను వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో కాలేజీలో భయానక వాతావరణం నెలకొంది.
Bandi Sanjay: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో జరుగుతున్న జూనియర్ సీనియర్ సెలెక్షన్ల పై సీరియస్ అయ్యారు.. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించకపోవడంపై వివరాలు సేకరించారు. సెలక్షన్ కమిటీలో ఉన్న సభ్యులపైన యాక్షన్ ఉండబోతుందని హెచ్చరించారు.. రాచకొండ కమిషనర్ కి సైతం సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. సెలక్షన్ కమిటీ సభ్యులు.. హైదరాబాద్‌లో ఉన్న నైపుణ్యం లేని క్రికెటర్లకి అవకాశం కల్పిస్తూ వారి దగ్గర డబ్బులు వసూలు…
Bengaluru: బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉగ్రవాది, సీరియల్ కిల్లర్లకు వీఐపీ సౌకర్యాలు కల్పించారు! జైలు లోపల ఉన్న అపఖ్యాతి పాలైన ఖైదీలు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ, టెలివిజన్ చూస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు సామాన్య జనాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. వీటిపై స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు.
UP: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మదర్సాలో ఓ మౌలానా మైనర్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఆ సంఘటన తర్వాత మౌలానా అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటన నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని పురానా సీతాపూర్‌లో జరిగింది. మౌలానా ఇర్ఫాన్ ఉల్ ఖాద్రీ తన ఇంట్లోని రెండవ అంతస్తులో మదర్సాను నడుపుతున్నాడు. ఈ మదర్సాలో దాదాపు 40 మంది విద్యార్థినులు చదువుతున్నారు.
Rajasthan Elderly Couple Dies Hours Apart in Barmer: మనిషికి ఎన్ని బంధాలున్నా సరే.. కడవరకు తోడుగా నిలిచేది జీవిత భాగస్వామితో ముడిపడిన బంధం మాత్రమే. అందరూ మనల్ని వదిలేసి వెళ్లినా సరే.. భాగస్వామి ఒక్కరే మన వెన్నంటి ఉంటారు. కష్టసుఖాల్లో సమానంగా పాలు పంచుకుంటారు. మరి అలాంటి తోడు.. మరణం సంభవించి దూరమైతే.. మిగిలిన వారి బాధను వర్ణించడానికి మాటలు చాలవు. ఇక కొందరైతే తమ తోడు లేని లోకంలో ఉండటం ఎందుకని బెంగ పెట్టుకుని మరణిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన…
Rajasthan: రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీకి చెందిన ఓ కూరగాయల వ్యాపారి ఈ మధ్య వార్తల్లో నిలిచాడు. సాధారణ జీవితాన్ని గడిపిన ఆయన ఇటీవల పంజాబ్‌లో రూ.11 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే అతడి జీవితం మారిపోయింది. కానీ.. ఒక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. ఈ లాటరీ గెలిచినప్పటి నుంచి అతడికి బెదిరింపులు, మోసపూరిత కాల్స్ వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో […]
Pakistan Navy Warship PNS Saif Visits Bangladesh: గత కొన్ని నెలలుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు జోరందుకున్నాయి. పాకిస్థాన్ సైనిక అధికారులు బంగ్లాదేశ్‌ను సందర్శిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ నేవీ యుద్ధనౌక చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుంది. పాకిస్థాన్ నేవీ యుద్ధనౌక, PNF SAIF, నాలుగు రోజుల సౌహార్ద పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుందని బంగ్లా నేవీ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది. బంగ్లాదేశ్ నేవీ పాక్ యుద్ధనౌకకు హృదయపూర్వక స్వాగతం పలికింది.
King: షారుఖ్ ఖాన్ ప్రముఖ పాత్రలో నటించిన “కింగ్” టీజర్ నవంబర్ 2న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. షారుఖ్ ఖాన్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతలో ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. పలు నివేదికల ప్రకారం.. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.350 కోట్లకు (సుమారు $3.5 బిలియన్లు) చేరుకుంది. షారుఖ్ ఖాన్, అతని బృందం ప్రమోషన్, ఇతర ఖర్చులు కాకుండా రూ. 350 […]
Varanasi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిని సందర్శించారు. ప్రధాని పర్యటనకు ముందు బీజేపీ ఎమ్మెల్యే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి.. ప్రధానమంత్రి మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా వారణాసిలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా శనివారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
DSP Richa Ghosh: భారతీయ మహిళా క్రికెట్ జట్టులోకి మరో డిస్పీ వచ్చారు. భారత మహిళా క్రికెట్ జట్టుకు స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అయిన రిచా ఘోష్, పశ్చిమ బెంగాల్ పోలీసులో డిఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమితులయ్యారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమెకు నియామక లేఖను స్వయంగా అందజేశారు. భారత మహిళా జట్టు ఇటీవలి ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన రిచా […]