Mimi Chakraborty: లైవ్ షోలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. ప్రేక్షకుల ముందే అవమానకర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mimi Chakraborty: ప్రముఖ నటి, మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తికి ఓ చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో తనను అవమానపరిచారని ఆమె వాపోయింది. ఈ మేరకు సోమవారం బొంగావ్ పోలీస్ స్టేషన్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి బొంగావ్ పట్టణంలోని నయాగ్రామ్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో చోటు చేసుకున్నట్లు నటి పేర్కొంది. మిమీ చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ప్రదర్శన జరుగుతుండగా నిర్వాహకులలో ఒకడైన తన్మయ్ శాస్త్రి స్టేజ్‌పైకి ఎక్కి, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కార్యక్రమాన్ని నిలిపివేయించాడు. ఆమెను స్టేజ్ నుంచి దిగిపోవాలని కోరాడు. అర్ధరాత్రి సమయానికి తన ప్రదర్శనను బలవంతంగా ఆపివేసి స్టేజ్ విడిచిపెట్టాలని చెప్పడం వల్ల తాను తీవ్ర అవమానానికి గురయ్యానని నటి పేర్కొంది.
READ MORE: MIW vs RCBW: WPLలో చరిత్ర సృష్టించిన నాట్ స్కివర్ బ్రంట్.. RCBపై ముంబై ఇండియన్స్ విజయం!
Also Read
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఈ ఘటనపై మిమీ చక్రవర్తి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లోనూ స్పందించింది. మహిళలు, కళాకారుల గౌరవం, భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. రిపబ్లిక్ డే రోజునే ఈ ఘటన జరగడంతో వాపోయింది… “దేశం స్వేచ్ఛ, సమానత్వం గురించి మాట్లాడుతుంది.. కానీ.. మహిళలు, కళాకారుల స్వతంత్రం, గౌరవం ఇప్పటికీ రాలేదు.” అని ఆమె పేర్కొంది. నయా గోపాల్ గంజ్ యువక్ సంఘ్ క్లబ్ ఆహ్వానంతో తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని, ప్రేక్షకుల ముందే మధ్యలో తన ప్రదర్శనను ఆపేసి స్టేజ్ విడిచిపెట్టమని చెప్పారని తెలిపింది. మైక్‌లో అవమానకర వ్యాఖ్యలు చేశారని, దాని వల్ల తనకు వ్యక్తిగతంగా అవమానం కలగడంతో పాటు ప్రజల్లో తన ప్రతిష్ఠకు కూడా భంగం కలిగిందని ఆమె ఆరోపించింది. పోలీసులు ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: US: భారత్-ఈయూ ఒప్పందం వేళ అమెరికా షాక్.. డీల్‌పై హాట్ కామెంట్స్
తాజావార్తలు
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!