Range Rover Sentinel: నిన్న దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగం కోసం కృషి చేసిన మహానీయులను తలచుకున్నారు. వారి కృషిని కొనియాడుతూ నివాళులు అర్పించారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇండియా గేట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా వేడుకలకు హాజరయ్యారు. నిన్న పరేడ్, జెండా, సైనిక కవాతులు ఎంత ఆకర్షణగా నిలిచాయో.. ప్రధాని వచ్చిన కారు సైతం వాహన ప్రియుల్లో అంతే ఆసక్తిని రేపింది. అది మామూలు కారు కాదు. దేశ ప్రధాని భద్రత కోసం ప్రత్యేకంగా తయారైన రేంజ్ రోవర్ సెంటినెల్. ఈ సెంటినెల్ వాహనం ప్రధాని కాన్వాయ్‌లో చాలా కీలకమైనది. జాతీయ వేడుకలు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో ప్రధాని ప్రయాణించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. బయట నుంచి చూస్తే ఇది ఒక భారీ, గంభీరమైన ఎస్‌యూవీలా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఇది కదిలే భద్రతా కోటలా ఉంటుంది.
READ MORE: Nampally: 48 గంటలు గడవకముందే నాంపల్లిలో మరో అగ్నిప్రమాదం..
ఈ వాహనంలో అతి ముఖ్యమైన భాగం దాని ఇంజిన్. ఇందులో 5.0 లీటర్ల సూపర్‌చార్జ్డ్ వి8 ఇంజిన్ ఉంటుంది. ఇది 380 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బరువు విషయానికి వస్తే, ఈ వాహనం సుమారు 4.4 టన్నులకుపైగా ఉంటుంది. అంత బరువున్నా.. ఇది వేగంలో ఏమాత్రం తగ్గదు. కేవలం 10.4 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుంది. గరిష్టంగా గంటకు 193 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా కదలాల్సి వస్తే ఈ సామర్థ్యం చాలా కీలకంగా ఉంటుంది. భద్రత విషయంలో సెంటినెల్ అసలు రాజీ పడదు. ఇది సాధారణ రేంజ్ రోవర్ కాదు. పూర్తిగా కవచంతో తయారైన ప్రత్యేక వర్షన్. దీనికి వీఆర్8 స్థాయి రక్షణ ఉంది. అంటే 7.62 ఎంఎం ఆర్మర్ పియర్సింగ్ తూటాలను సైతం తట్టుకునే శక్తి దీనికి ఉంది. పేలుళ్ల విషయంలోనూ అద్భుతమైన రక్షణ ఇస్తుంది. పక్కవైపు నుంచి 15 కిలోల టీఎన్‌టీ పేలుడు జరిగినా వాహనం నిలకడగా ఉండేలా డిజైన్ చేశారు. అలాగే పై నుంచి లేదా కింద
నుంచి జరిగే గ్రెనేడ్ దాడులను సైతం ఇది తట్టుకోగలదు. అంతేకాదు.. వాహనంలో ప్రత్యేక ఫైర్ సప్రెషన్ సిస్టమ్ ఉంటుంది.
READ MORE: Anil Ravipudi: నా సక్సెస్ ఫార్ములా ఇదే: డైరెక్టర్ అనిల్ రావిపూడి
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చేలా ఇది పనిచేస్తుంది. పొగ లేదా హానికర వాయువులు లోపలికి రాకుండా ఉండేందుకు లోపలే ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ సైతం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో బయట ఉన్నవారితో మాట్లాడేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ సైతం అమర్చారు. అంటే కారులోపలే ఉండి.. అద్ధాలు మూసి ఉన్నప్పటికీ బయట వ్యక్తులో మైక్ సహాయంతో మాట్లొడొచ్చు. ఇన్ని రక్షణ వ్యవస్థలు ఉన్నా, లోపల కూర్చుంటే మాత్రం అది ఒక విలాసవంతమైన కారులో ఉన్న అనుభూతినే ఇస్తుంది. సెంటినెల్ లోపలి భాగం ల్యాండ్ రోవర్ టచ్ ప్రో డ్యుయో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో రెండు 10 అంగుళాల హై రిజల్యూషన్ టచ్ స్క్రీన్లు ఉంటాయి.