Police Challan:ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు స్కూటర్‌కు రూ. 20,74,000 జరిమానా విధించారు. ఈ వివాదాస్పద జరిమానా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఈ ఘటన అనంతరం అధికారులు వివరణలు జారీ చేస్తున్నారు. నిజానికి, నవంబర్ 4న, నాయి మండి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గాంధీ కాలనీ పోలీస్ పోస్ట్‌లో అన్మోల్ సింఘాల్ అనే స్కూటర్ రైడర్‌కు 20.74 లక్షల రూపాయల చలాన్ […]
Bihar Elections 2025: బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలోని బైకుంత్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల అనంతరం.. హింస చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిధవాలియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బుచెయా గ్రామంలో ఒక దళిత కుటుంబంపై తీవ్రంగా దాడి చేశారు. బాధితుల ప్రకారం.. ఓటు వేసిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా కొంతమంది వారిని ఆపి బీజేపీకి ఓటు వేశారని ఆరోపిస్తూ కొట్టారు. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. చికిత్స కోసం సదర్ ఆసుపత్రిలో చేరారు. దాడి చేసిన వారిలో…
Nagpur: మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ సమీపంలో 52 ఏళ్ల రాజు పటేల్ అనే వ్యక్తి మద్యం మత్తులో పులిని మచ్చిక చేసుకుని తన మందు బాటిల్ నుంచి తాగించే ప్రయత్నం చేసిన వీడియో వైరల్ అయింది. ఆయన అలా చేసి ఎలాంటి హాని లేకుండా తప్పించుకున్నాడని చెప్పే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. ఈ వీడియో లియన్ల వ్యూస్ పొందింది. క్యాప్షన్ ప్రకారం, రాజు పటేల్ పేకాట ఆడి..తాగిన మత్తులో రోడ్డుపైకి […]
Arundhati Reddy: రెండు పర్యాయాలు ఫైనల్‌కు చేరినా విజేతగా మాత్రం నిలవలేక పోయింది భారత మహిళా జట్టు. ఈసారి ఆ పరాభవాలకు చెక్ పెడుతూ 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించింది. వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించింది. ఈ సారి భారత జట్టులో అందరూ ధిట్టలే.. ఎక్కడా తడపడకుండా విజయ దుందుబి మోగించారు. ఈ సందర్భంగా మన తెలుగు తేజం, తెలంగాణకు చెందిన మహిళా క్రీడాకారిణి అరుంధతి రెడ్డి ఎన్టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో…
Arundhati Reddy: ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. భారత మహిళల క్రికెట్ జట్టు చిరస్మరణీయ విజయం సాధించి ప్రపంచ కప్ గెలుచుకుంది. తొలిసారి టీమిండియా ప్రపంచకప్ ను ఒడిసిపట్టుకుంది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు ఎలాంటి తడబాటు లేకుండా అదరగొట్టింది. వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో తెలంగాణకు చెందిన అరుంధతి రెడ్డి ఉండటం మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వకారణం. అయితే.. తాజాగా అరుంధతి ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. వరల్డ్ కప్…
Bihar Elections 2025: బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు కనిపించాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ, పారదర్శకత, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ప్రశ్నించింది. "సమస్తిపూర్ సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డుపై ఈవీఎంల నుంచి పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు విసిరేశారు. ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరి ఆదేశం మేరకు ఈ స్లిప్పులు విసిరేశారు..? కమిషన్ దీనికి సమాధానం ఇస్తుందా? బయటి…
Abhishek Sharma: ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు నవంబర్ 8వ తేదీన బ్రిస్బేన్‌లోని గబ్బాలో ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా శుభారంభం చేశారు. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ అద్భుత ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అంతర్జాతీయ […]
J&K: జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంత్‌నాగ్‌కు చెందిన ప్రభుత్వ మాజీ వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ లాకర్ లో AK-47 రైఫిల్ లభ్యమైంది. పోలీసులు ఈ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంత్‌నాగ్‌లోని జల్గుండ్ నివాసి ఆదిల్ 2024 అక్టోబర్ 24 వరకు GMC అనంత్‌నాగ్‌లో పనిచేశాడని పోలీసులు తెలిపారు. నౌగామ్ పోలీస్ స్టేషన్లో FIR నంబర్ 162/2025 కింద భారత శిక్షాస్మృతి, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు,…
America Winchester Haunted House: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్‌జోస్ నగరంలో ఉన్న వించెస్టర్ హాంటెడ్ హౌస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ భవనం వెనుక దాగి ఉన్న కథ, అనేక రహస్యాలు, అనుభవాలు, అసాధారణ సంఘటనలతో నిండి ఉంటుంది. ఈ భవనాన్ని “వించెస్టర్ మిస్టరీ హౌస్”గా కూడా పిలుస్తారు. ఇది అమెరికన్ గన్ తయారీ సంస్థ “వించెస్టర్ రిపీటింగ్ ఆర్మ్స్ కంపెనీ” వారసురాలు సారా వించెస్టర్ నిర్మించింది. సారా భర్త విలియం వించెస్టర్ గన్ కంపెనీ యజమాని. ఈ సంస్థ తయారు చేసిన…
HYDRA: వరద ముప్పు తప్పించిన హైడ్రాకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. అభినందనల ప్లకార్డులతో అమీర్‌పేట, ప్యాట్నీ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. మైత్రివనం వద్ద హైడ్రాకు మద్దతుగా మానవహారం కార్యక్రమం చేపట్టారు. 5 సెంటీమీటర్ల వర్షానికే మునిగిపోయే కాలనీలకు హైడ్రా ఉపశమనం కల్పించిందన్నారు.