Delhi Blast Case: ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో సంచలన అంశం బయటపడింది. ఉగ్రవాది డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ రెండు నెలల క్రితం లక్నోకు వెళ్లి అనేక మంది అనుమానాస్పద వ్యక్తులను కలిసిందని దర్యాప్తులో తేలింది. ఆమె పరిచయస్తులలో కొందరు అయోధ్య రామాలయాన్ని సైతం సందర్శించారని వర్గాలు చెబుతున్నాయి. లక్నోలో షాహీన్ ఎవర్ని కలిసింది? ఆమె ఎక్కడ బస చేసింది? అయోధ్యలో ఏదైనా కుట్ర జరిపారా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె లక్నోకు వచ్చినట్లు జమ్మూకశ్మీర్ […]
Delhi Car Blast: ఢిల్లీ ఉగ్రదాడిపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కేవలం i20 లేదా EcoSport కార్లను మాత్రమే కాకుండా, మరో రెండు పాత వాహనాలను పేలుడు పదార్థాలతో నింపడానికి సిద్ధమయ్యారు. అనేక ప్రదేశాల్లో దాడులు నిర్వహించడానికి వీలుగా అదనపు వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ సమాచారాన్ని అనుసరించి, ఏజెన్సీలు ఇప్పుడు ఈ అదనపు […]
Delhi Car Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ మొహమ్మద్ గురించి ఓ ప్రధాన అంశం వెల్లడైంది. ఉమర్ పేలుడుకు ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఒక మసీదుకు వెళ్ళాడు. ఎర్రకోట వైపు వెళ్ళే ముందు 10 నిమిషాలకు పైగా అక్కడే గడిపాడు. ఇది ఫైజ్-ఎ-ఇలాహి మసీదు. తుర్క్‌మాన్ గేట్ ఎదురుగా రాంలీలా మైదాన్ మూలలో ఉంది. నిజాముద్దీన్ మర్కజ్ లాగానే ఈ మసీదులో తబ్లిగీ జమాత్ జరుగుతుందని చెబుతున్నారు. […]
Gujarat ATS Raids: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మంగళవారం అర్ధరాత్రి గుజరాత్ ఏటీఎస్ పోలీస్ సోదాలు కలకలం సృష్టించాయి. ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ మొహియుదిన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం సోదాల్లో పాల్గొంది. మూడు రకాల లిక్విడ్లతో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ సోదరుడు ఓమర్ ఫారుఖీకి నోటీసులు ఇచ్చి సెర్చ్ నిర్వహించారు. అనంతరం…
Marko Rubio: ఢిల్లీ బాంబు పేలుళ్ల దర్యాప్తులో తమ దేశం భారతదేశానికి సహాయం అందించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం అన్నారు. భారత దర్యాప్తు సంస్థలను ప్రశంసించారు. "భారత్‌కు చెందిన దర్యాప్తు సంస్థలు చాలా ప్రొఫెషనల్, ఖచ్చితమైన దర్యాప్తును నిర్వహించగల పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి.
Koti Deepotsavam Day 13: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆధ్యాత్మిక మహా సమ్మేళనం కొనసాగుతోంది.. భక్తి టీవీ నేతృత్వంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఇప్పటికే విజయవంతమైంది. ప్రత్యేక పూజలతో పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించారు.. ప్రతీ రోజూ విశేష పూజలు.. కల్యాణాలు.. ప్రవచనాలు, వాహన సేవలతో భక్తులను కట్టిపడేస్తోంది కోటి దీపోత్సవం వేడుక.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం.. సనాతన ధర్మ వ్యాప్తి కోసం.. లక్షల దీపాలతో లక్ష దీపోత్సవంగా ప్రారంభించిన ఈ దీపోత్సవం..
Delhi Bomb Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన విధ్వంసకర బాంబు దాడి కేసు దర్యాప్తులో సంచలన విషయం బయటపడింది. పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 కారులో ఉన్న వ్యక్తి మరెవరో కాదు ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ (ఉమర్ మొహమ్మద్) అని పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు బుధవారం రాత్రి ఆలస్యంగా నిర్ధారించాయి. కారు శిథిలాల నుంచి వెలికితీసిన కాలిపోయిన మృతదేహానికి DNA పరీక్ష నిర్వహించగా.. ఉమర్ కుటుంబ సభ్యుల నమూనాలతో 100% సరిపోలింది.
Koti Deepotsavam Day 12: కార్తీకమాసం పర్వదినాల్లో భాగంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 పన్నేండవ రోజు కార్యక్రమాలు అద్భుత ఆధ్యాత్మిక వైభవంతో మెరిశాయి. ఎన్టీఆర్ స్టేడియం భక్త కోలాహలం మధ్య శివ నామస్మరణతో మార్మోగింది. వేలాది భక్తులు ఒకే స్వరంతో “ఓం నమః శివాయ” జపిస్తూ వెలిగించిన దీపాలు ఆ ప్రాంగణాన్ని దివ్యజ్యోతి ప్రదేశంగా మార్చేశాయి. ప్రతి దీపం ఆత్మజ్యోతి సందేశాన్ని అందిస్తూ భక్తుల హృదయాలను పరవశింపజేసింది. 2012లో ఆరంభమైన ఈ మహోత్సవం నేడు అంతర్జాతీయ స్థాయిలో…
Chidambaram: ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడిపై తాజాగా మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "దేశీయ ఉగ్రవాదం" అంశాన్ని లేవనెత్తారు. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు కొందరైతే.. దేశంలో తయారవుతున్న స్వదేశీ ఉగ్రవాదులు మరి కొందరని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని వివరించారు. "పహల్గామ్ దాడికి ముందు, తరువాత దేశంలో రెండు రకాల ఉగ్రవాదులు ఉన్నారని నేను చెప్పాను.
UP: ప్రమాదకరమైన పబ్జీ ఆటకు యువకులు, పిల్లలు బలి కావడం మనం చూసే ఉంటాం. కానీ.. ఆ మాయదారికి ఆట ఓ తల్లిని పొట్టనబెట్టుకుంది. యూపీ రాష్ట్రం ఝాన్సీలోని రక్షా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. తన కొడుకు పబ్జీ ఆట, టీవీకి బానిస మారాడు. దీంతో తల్లి తరచూ బాధపడుతుండేది.