Kurnool: కర్నూలు జిల్లాలో ఓ మాజీ ప్రియురాలు అరాచకం సృష్టించింది. ప్రేమించిన వ్యక్తి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఘాతుకానికి తెగబడింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో ప్రియుడి భార్యకు HIV వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 9న ఓ వైద్యురాలు ఆసుపత్రి నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా కేసి కెనాల్ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొట్టారు. వైద్యురాలు స్కూటీపై నుంచి కిందపడగానే పక్కనే ఉన్న ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి పరుగున కింద పడ్డ డాక్టర్ దగ్గరకు వచ్చారు. సాయం చేస్తున్నట్లు నటించి ఆ మహిళా డాక్టర్‌కు ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ బాధితురాలు గట్టిగా అరిచింది. అక్కడి నుంచి ఈ నలుగురు పరారయ్యారు. ఆ డాక్టర్ తనకు ఇచ్చిన ఇంజక్షన్‌పై అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది.
READ MORE: Harish Shankar : అహంకారం కాదు.. అనుబంధం ముఖ్యం: ఫ్యాన్స్‌ను అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!
కేసు దర్యాప్తులో భాగంగా మహిళా డాక్టర్ స్కూటీ పడిపోయిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆ సమయంలో అక్కడ ఉన్న నలుగురు నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీస్ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలైన వైద్యురాలు భర్తకు ఇంజక్షన్ గుచ్చిన మహిళకు గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఆ వైద్యురాలికి సహాయం చేస్తున్నట్లు నటించిన ఆ నలుగురిలో మంత్రాలయానికి చెందిన భూమా జశ్వంత్, శృతిలతో పాటు బీచుపల్లి బోయ వసుంధర అలియాస్ వేదవతి (కర్నూలు), కొంగె జ్యోతి (ఆదోని) ఉన్నారు. నిందితుల్లో ఒకరైన వసుంధర అనే మహిళ నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఆమె గతంలో ఓ డాక్టర్ కింద పని చేసింది. దీంతో ఆమె ఆ వైద్యుడిని ప్రేమించింది. ఆ వైద్యుడు వసుంధరను కాదని మరో డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నాడు. దీంతో వసుంధర ఆ డాక్టర్‌పై పగ పెంచుకుంది. ఆ వైద్యురాలికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్ చేయాలని ప్లాన్ వేసింది. ఈక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవీ రోగుల నుంచి ఇతర నర్సు సాయంతో హెచ్‌ఐవీ వైరస్‌తో కూడిన రక్తాన్ని సేకరించింది. పక్కా ప్లాన్‌తో తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఆ మహిళా డాక్టర్‌కు ఇంజెక్ట్ చేసింది.
READ MORE: Gold Price: తొందరపడి ఇప్పుడే బంగారం కొనకండి.. త్వరలో భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్స్..