-
Cease Fire Violation : అమృత్‌సర్‌లో కొనసాగుతున్న హైఅలర్ట్.. ప్రజలకు ప్రభుత్వ కీలక సూచనలు!
పంజాబ్ అమృత్‌సర్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రభుత్వం మరోసారి ప్రజలకు కీలక సూచనలు చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలని.. దయచేసి ఇళ్లలో లైట్లు ఆపి, కిటికీలకు దూరంగా ఇంటి లోపల ఉండాలని సూచించింది. దయచేసి రోడ్డు, బాల్కనీ లేదా టెర్రస్‌పైకి వెళ్లవద్దని తెలిపింది. భయపడవద్దని.. సాధారణ కార్యకలాపాలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామో తెలియజేస్తామని ప్రకటించింది. ఈ సమాచారాన్ని అమృత్సర్ డీసీ ఉదయం 4.39 గంటలకు జారీ చేసిన మార్గదర్శకంలో తెలిపింది. -
Indian Air Force: పాక్ దాడిలో మరో భారత జవాన్ వీరమరణం..
శనివారం ఉదయం భారత్‌లోని అనేక ప్రాంతాలలో పాకిస్థాన్ డ్రోన్ దాడులను నిర్వహించింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న వైమానిక దళ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే.. భారత సైన్యం, రక్షణ వ్యవస్థ శత్రు డ్రోన్‌ను గాల్లోనే కూల్చివేశాయి. ఈ సమయంలో వైమానిక దళ స్టేషన్లో విధుల్లో ఉన్న ఒక సైనికుడు వీరమరణం పొందాడు. పాకిస్థాన్ డ్రోన్ ముక్కను ఢీకొట్టడంతో అమరుడయ్యారు. -
Bangladesh: షాకింగ్.. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ను నిషేధించిన యూనస్ ప్రభుత్వం!
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం, పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తాత్కాలిక ప్రభుత్వం శనివారం ఒక పెద్ద అడుగు వేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం ప్రకటించింది. ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఈ నిషేధం విధించినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో అవామీ లీగ్, దాని నాయకులపై జరుగుతున్న విచారణ పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం… -
Ceasefire Violation: మేము కాల్పుల విరమణను ఉల్లంఘించలేదు: పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ
పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కాల్పుల విరమణ ఉల్లంఘనను వార్తలను ఖండించింది. పూర్తి నిజాయితీతో కాల్పుల విరమణను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే.. భారతదేశం వైపు నుంచి ఉల్లంఘన సంఘటనలు జరిగాయని ఆరోపించింది. వాటిని పాకిస్థాన్ సైన్యం బాధ్యతాయుతంగా, సంయమనంతో నిర్వహించిందని పేర్కొంది. కాల్పుల విరమణ సజావుగా అమలు చేయడంలో ఏమైనా సమస్యలు తలెత్తే.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. -
Cease Fire Violation : భారత్‌లోకి చొరబడేందుకు పాక్ యత్నం.. తిప్పికొట్టిన సైన్యం!
సరిహద్దుల్లో నగ్రోటా వద్ద చొరబాటుకు పాక్ యత్నించింది. పాక్ చొరబాటుదారులపై భారత రక్షణ దళం కాల్పులు జరిపింది. చొరబాటు దారులు సైతం కాల్పులు జరపగా.. ఓ ఇండియన్ ఆర్మీ జవాను గాయపడ్డారు. ప్రస్తుతం రక్షణా దళాలు చొరబాటుదారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ విషయాన్ని భారత సైన్యం వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్ ద్వారా తెలియజేసింది. -
Ajit Doval: పాక్- భారత్ వివాదం.. అజిత్ దోవల్‌తో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి!
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత సిబ్బందిలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దోవల్ పేర్కొన్నారు. యుద్ధం భారత్ తమ ఛాయిస్ కాదని ఆయన నొక్కి చెప్పారు. -
BSF : పాకిస్థాన్ కాల్పుల్లో ఎస్ఐ మహ్మద్ ఇంతియాజ్ వీరమరణం..
జమ్మూ కశ్మీర్‌లోని పాకిస్థాన్ సరిహద్దులో జరిగిన క్రాస్ కాల్పుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్)కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ అమరులయ్యారు. బీఎస్ఎఫ్ ట్వీట్ ద్వారా ఆయన బలిదానాన్ని ధృవీకరించింది. మహ్మద్ ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి వందనం సమర్పించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. మే 8 మరియు 9 తేదీల మధ్య రాత్రి జరిగిన షెల్లింగ్‌లో మహ్మద్ ఇంతియాజ్ గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. -
Virender Sehwag: ‘కుక్క తోకర వంకర’.. పాక్ దాడిపై సెహ్వాగ్ సంచలన ట్వీట్
అమెరికా అధ్యక్షుడు అధికారికంగా భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత.. పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. శ్రీనగర్ సహా అనేక భారతీయ ప్రాంతాలలో డ్రోన్లు కనిపించాయి. శ్రీనగర్, రాజస్థాన్, గుజారాత్ రాష్ట్రంలోని బార్డర్లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కఠినమైన వైఖరి తీసుకుంది. పాకిస్థాన్‌ను తిప్పికొట్టాలని నిర్ణయించింది. -
China: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. చైనా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన..
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు సంబంధించి చైనా ప్రకటన వెలువడింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో తాము అండగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. ఈ మేరక తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో చైనా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాంగ్‌యీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగశాఖ కార్యాలయం వెల్లడించింది. -
Vikram Misri: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది: విక్రమ్ మిస్రీ
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని.. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. సరిహద్దు పొడవునా పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని. ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించినట్లు వెల్లడించారు. సైన్యం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చామన్నారు. కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని చెప్పారు. ఇది అత్యంత దుర్మార్గమన్నారు.
తాజావార్తలు
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!