-
Cease Fire Violation : గుజరాత్లో పాకిస్థాన్ డ్రోన్లు.. రాష్ట్ర మంత్రి కీలక సూచనలు…
గుజరాత్‌లోని కచ్‌లో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీ అన్నారు. "కచ్ జిల్లాలో అనేక డ్రోన్లు కనిపించాయి. ఇప్పుడు పూర్తిగా బ్లాక్అవుట్ అమలు చేయబడింది. దయచేసి సురక్షితంగా ఉండండి, భయపడవద్దు" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా.. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోన్స్ ప్రయోగిస్తోందని చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. ఈ దాడిని భద్రతా దళాలు ఇంకా ధృవీకరించలేదు. -
Cease Fire Violation : పాకిస్థాన్ ప్రభుత్వం మాటను ఆదేశ ఆర్మీ వినడం లేదా?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతను పరిష్కరించడానికి అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. అయితే.. కాల్పుల విరమణ ప్రకటించిన నాలుగు గంటల తర్వాత.. పాకిస్థాన్ సైన్యం మళ్లీ భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులకు దిగినట్లు తెలుస్తోంది. తాజాగా జమ్మూ కశ్మీర్లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం. -
Cease Fire Violation : శ్రీనగర్‌లో పాకిస్థాన్ డ్రోన్ దాడులు.. వీడియో షేర్ చేసిన ఒమర్ అబ్దుల్లా..
భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శ్రీనగర్ మీదుగా పెద్ద ఎత్తున డ్రోన్ కార్యకలాపాలు జరిగినట్లు సమాచారం. శ్రీనగర్‌లో జరిగిన డ్రోన్ దాడి వీడియోను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా షేర్ చేశారు. పాకిస్థాన్ భారీ షెల్లింగ్‌కు దిగిందని.. కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు."ఇది కాల్పుల విరమణ కాదు. శ్రీనగర్ మధ్యలో ఉన్న వైమానిక రక్షణ విభాగాలు ఇప్పుడే తెరుచుకున్నాయి" అని సీఎం సోషల్ మీడియాలో పోస్ట్ లో రాసుకొచ్చారు. -
Cease Fire Violation: మారని పాకిస్థాన్ బుద్ది.. భారత్‌పై మళ్లీ దాడులు?
భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్ పురా సెక్టార్ల నుంచి ఫిరంగి దాడులు జరిగినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్లో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భద్రతా దళాలు ఒక డ్రోన్‌ను కూల్చివేశాయి. జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. -
Indus River: సింధు నదీ జలాలు పాకిస్థాన్‌కు వదులుతారా?
భారత్, పాకిస్థాన్ మధ్య పూర్తిస్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఇరు దేశాలు శనివారం రోజు పరస్పరం చర్చించుకొని దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ చర్చల కోసం ఈరోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) నుంచి భారత డీజీఎంఓకు ఫోన్ కాల్ వచ్చింది. కాల్పుల విరమణ అంశంపై ఇద్దరూ చర్చించుకున్నారు. కాగా.. ఇప్పుడు అందరూ సింధు నదీ జలాల అంశంపై క్లారిటీ వచ్చింది. -
Who is India’s DGMO: కాల్పుల విరమణలో కీలకంగా వ్యవహరించిన DGMO ఎవరు?
భారతదేశం పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. ఇరు దేశాల DGMO (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్)ల మధ్య చర్చల తర్వాత ఇది సాధ్యమైంది. అసలు భారతీయ డీజీఎమ్ ఎవరు? అతని పని ఏంటో తెలుసుకుందాం.. డీజీఎమ్ఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. ఇది సైన్యంలో ఒక ముఖ్యమైన, బాధ్యతాయుతమైన పదవి. ప్రస్తుత భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. అన్ని సైనిక కార్యకలాపాల బాధ్యత డీజీఎమ్ఓదే. ఏదైనా సైనిక చర్య, మార్గనిర్దేశం చేయడం, సూచనలు ఇవ్వడం, ఇతర అన్ని పనులను… -
Omar Abdullah : కాల్పుల విరమణ ఒప్పందంపై ఒమర్ అబ్దుల్లా రియాక్షన్..
పహల్గామ్ ఉగ్రదాడి భారత్‌ను భగ్గుమనేలా చేసింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా భారత్ పాక్ మధ్య యుద్ధంలాంటి పరిస్థితి దాపురించింది. తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఈ సమాచారాన్ని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అందించారు. కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇంతలో పలువురు రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ అంశంపై మాట్లాడారు. -
India- Pakistan: పాకిస్థాన్ ఎన్నిసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘించిందో తెలుసా?
భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ పూర్తిగా భయపడింది. మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. "కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్థాన్లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి." అని ట్రంప్ పేర్కొన్నారు. -
IND PAK War: తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాం: పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్
భారత్, పాక్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఈ అంశంపై పాక్ మంత్రి స్పందించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తక్షణ కాల్పుల విరమణను ధృవీకరించారు. భారతదేశం -పాకిస్థాన్ మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయంపై ఇరు దేశాలు అంగీకరించాయి. “పాకిస్థాన్-భారత్ తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాకిస్థాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రాజీ పడలేదు. దేశంలో శాంతి, భద్రత కోసం […] -
IND PAK War: కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్- పాకిస్థాన్.. ట్రంప్ స్పష్టం!
పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ తర్వాత దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి కాగానే డ్రోన్లు, క్షిపణులతో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్థాన్ జరుపుతున్న దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు.. సరిహద్దుల్లో కాల్పులకు కూడా గట్టిగా బదులిస్తోంది. అదే సమయంలో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత దళాలు భీకరదాడులకు దిగాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
తాజావార్తలు
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!