జమ్మూ కశ్మీర్‌లోని పాకిస్థాన్ సరిహద్దులో జరిగిన క్రాస్ కాల్పుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్)కి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ అమరులయ్యారు. బీఎస్ఎఫ్ ట్వీట్ ద్వారా ఆయన బలిదానాన్ని ధృవీకరించింది. మహ్మద్ ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి వందనం సమర్పించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. మే 8 మరియు 9 తేదీల మధ్య రాత్రి జరిగిన షెల్లింగ్‌లో మహ్మద్ ఇంతియాజ్ గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం రాత్రి అమరులైనట్లు తెలుస్తోంది. “మే 10, 2025న జమ్మూ జిల్లా ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు కాల్పుల సమయంలో దేశ సేవలో బీఎస్‌ఎఫ్‌కు చెందిన ధైర్యవంతుడు సబ్-ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ చేసిన అత్యున్నత త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాం. బీఎస్‌ఎఫ్ సరిహద్దు పోస్టుకు నాయకత్వం వహిస్తూ, ముందు వరుసలో ధైర్యంగా నాయకత్వం వహించారు” అని బీఎస్‌ఎఫ్ ట్వీట్‌లో పేర్కొంది.
READ MORE: China: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. చైనా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన..
బీఎస్‌ఎఫ్ డీజీ, అన్ని ర్యాంకులు అధికారులు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆదివారం జమ్మూ పలౌరాలోని ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో పూర్తి గౌరవాలతో పుష్పగుచ్ఛాల కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. శనివారం జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్ జవాను అమరవీరుడయ్యారు. మరో ఏడుగురు గాయపడ్డట్లు సమాచారం. ఈ సంఘటన ఆర్ఎస్ పురా సెక్టార్‌లో జరిగిందని అధికారులు తెలిపారు.
READ MORE: Vikram Misri: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది: విక్రమ్ మిస్రీ
We salute the supreme sacrifice made by BSF #Braveheart Sub Inspector Md Imteyaz in service of the nation on 10 May 2025 during cross border firing along the International Boundary in R S Pura area, District Jammu.
While leading a BSF border out post, he gallantly led from the… pic.twitter.com/crXeVFSgUZ
— BSF JAMMU (@bsf_jammu) May 10, 2025