జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ ఉపసంహరణతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయ్యింది. సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఎమ్‌ఐఎమ్ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లతో కలిపి 17 నామినేషన్లు దాఖలయ్యాయి.. 15 మంది సభ్యులు ఉండే స్టాండింగ్ కమిటీకి బీఆర్ఎస్ ఉపసంహరణతో ఎన్నిక లేకుండా ఎమ్ఐఎమ్, కాంగ్రెస్ సభ్యులతో ఏకగ్రీవమైంది.. 15 స్టాండింగ్ కమిటీ సభ్యులకు గాను ఎనిమిది మంది ఎమ్ఐఎమ్, ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు ఉండనున్నారు.. గత పదేళ్ల నుంచి మొదటి సారి స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉండనున్నారు.. గత పదేళ్లుగా బీఆర్ఎస్ లేకుండా ఎన్నికవుతున్న స్టాండింగ్ కమిటీ కూడా ఇదే..
READ MORE: Tshering Tobgay: మోడీ తనకు పెద్దన్న.. భూటాన్ ప్రధాని వ్యాఖ్య
ఇదిలా ఉండగా.. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ప్రతీ ఏడాది ఎన్నుకుంటారు. జీహెచ్‌ఎంసీలో పాలనాపరంగా, కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా మేయర్, డిప్యూటీ మేయర్ అనంతరం ఈ 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎంతో కీలకం. గడిచిన పదేళ్ల వ్యవధిలో ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగలేదు. ప్రతీసారి కూడా ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ సారి బీజేపీ, బీఆర్‌ఎస్ సంఖ్యాబలం కొంత ఎక్కువగా ఉండటం, కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి రావడం, మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మారడం ఈ పరిణామాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని భావించినప్పటికీ బీఆర్‌ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఇద్దరు కార్పొరేటర్లు కూడా విత్‌డ్రా చేసుకున్నారు. బీజేపీ బరిలోకి దిగలేదు. దీంతో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.
READ MORE: Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది..