సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులు వంశీకృష్ణ, సంతోషకుమార్, పరశురామ్ తరఫు న్యాయవాది లక్ష్మణ్ పిటిషన్ దాఖలు చేయగా.. ఒక్కొక్కరు రూ.20 వేల పూచీకత్తు, రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ ఇచ్చింది. కాగా.. ఈ రోజు ముగ్గురు నిందితులు వంశి కృష్ణ, పరశురములు, సంతోష్ కుమార్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నిందితుడు వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశాడు..
READ MORE: Bank of Baroda: నిరుద్యోగులకు సువర్ణ అవకాశం.. బ్యాంకులో భారీగా ఉద్యోగాలు
“నేను చక్రధర్ గౌడ్ దగ్గర నాలుగు నెలలు పని చేశాను. ఆ తరువాత హరీష్ రావు దగ్గర 3 నెలల పని చేశాను. ఆరోగ్యశ్రీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేశాను. నేను డబ్బులు అడిగినట్లు చక్రధర్ గౌడ్ వీడియోలు చేశాడు. విచారణలో హరీష్ రావు పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేశారు. హరీష్ రావుతో నేనుప్పుడూ మాట్లాడలేదు. చక్రధర్ గౌడ్ దగ్గర నేను పని చేశాను కాబట్టే నన్ను టార్గెట్ చేశారు. అందుకే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాను?” అని నిందితుడిలో ఒకరైన వంశీకృష్ణ తన స్పష్టం చేశాడు. “నాకు మొబైల్ నెట్వర్క్ షాప్ ఉంది. తెలిసిన వాళ్ళే కదా అని సిమ్ కార్డు ఇచ్చాను. సిమ్ కార్డు ఇచ్చినందుకు నన్ను అరెస్ట్ చేశారు. యాదగిరి పేరు మీద సిమ్ కార్డు తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ” అని సంతోష్ తెలిపాడు.
READ MORE: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు మార్ఫింగ్‌పై కేసులు!