Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది..
- కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు
- రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు
- ఇప్పటి వరకూ జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకోవడం లేదు
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు మోసమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. 14 నెలలు అయినా వారి గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, DA లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చింది. మారింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి కానీ తెలంగాణ పరిస్థితి మారలేదు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారు. నేడు రేవంత్ కూడా కేసీఆర్ లానే వ్యవహరిస్తున్నారు.” అని కేంద్ర మంత్రి విమర్శించారు.
READ MORE: Toilet Usage Management Rule: ఉద్యోగులు టాయిలెట్స్ వినియోగంపై వింత రూల్స్!
Also Read
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
“అభివృద్ధి పనులు అన్ని కుంటుపడ్డాయి. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి.. ప్రకటనలు ముందు పేజీలో ఉన్నాయి పనులు మాత్రం లేవు. కాంగ్రెస్ మంత్రుల మధ్య సమన్వయం లేదు. శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం. కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో అవినీతి బాగా పెరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో కరెంట్ బిల్లులు కట్టలేక, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అమలు కావడం లేదు. బీజేపీపాలిత రాష్టాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ సమర్థవంతంగా పని చేస్తూంది. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతాం.” అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని కిషన్‌రెడ్డి అన్నారు.. “బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో చేతులెత్తేసింది. ఈ ఎన్నికలు తెలంగాణకి దశ దిశ నిర్దేశిస్తాయి. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రం అయ్యింది.. అహంకారం పెరిగిందని కాంగ్రెస్ నేతలు చెప్పి అధికారంలో వచ్చారు. ఆరు గ్యారెంటీలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ 14 నెలలు కావస్తున్నా ఏ పనులు చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇచ్చిన ఏ హామీ కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదు. ఉద్యోగాలు ఇస్తామని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పింది.” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?