ఒక కప్పు టీకి రూ. లక్ష ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అవును.. మీరు నమ్మకపోయినా.. ఇది నిజం. దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్ మెనూలో లక్ష రూపాయల టీ కనిపిస్తుంది. ఈ 'గోల్డ్ కడక్' టీ ధర ఆకాశాన్నంటుతోంది. దుబాయ్‌లో భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్త సుచేతా శర్మ రెస్టారెంట్లో ఈ ఖరీదైన చాయ్‌ని అమ్ముతున్నారు. ఈ బోహో కేఫ్ లో టీ ధర AED 5000 (సుమారు రూ. 1.14 లక్షలు). 24 క్యారెట్ల బంగారు పూత కలిపిన ఈ టీని స్వచ్ఛమైన…
బాలీవుడ్ షోమ్యాన్ రాజ్ కపూర్ భారతీయ సినిమాకు పరిచయం అవసరం లేని వ్యక్తి. భారతీయ సినిమాలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పనిచేశారు. తన సినిమాలతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కపూర్ కుటుంబం డిసెంబర్ 14న రాజ్ కపూర్ 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులంతా పాల్గొన్నారు. భారత్‌తో పాటు, పాకిస్థాన్‌లోని కొందరు అభిమానులు కూడా రాజ్ కపూర్ 100వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. బెయిల్ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదయ్యాడు.. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో అల్లును అరెస్టు చేశారు. అయితే శుక్రవారం రాత్రి జైలు జీవితం గడిపిన ఐకాన్ స్టార్ శనివారం ఉదయం విడుదలయ్యాడు. అల్లు తిరిగి రావడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానుల్లో ఆనంద వాతావరణం నెలకొంది. భార్య స్నేహారెడ్డి అతన్ని గట్టిగా కౌగిలించుకుని, భావోద్వేగానికి లోనైంది. అల్లు అర్జున్ అరెస్ట్ పై స్టార్స్ రియాక్షన్స్ బయటకు వస్తున్నాయి.…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. కొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు శుభం కార్డు పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు పశ్చిమ మండల పోలీసులు తెలిపారు. దాదాపుగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. తరచూ సోషల్ మీడియా వేదికగా తమ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. తన తాతయ్య తనకు బోధించిన సనాతన ధర్మం యొక్క నిర్వచనాన్ని ప్రస్తావిస్తూ... ఎక్స్ లో ఓ పోస్ట్ పంచుకుంది. గౌరవ, మర్యాదలతో ఇతరులకు వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని తన తాత ఆమెకు చెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. బెయిల్ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదయ్యాడు.. మొదట గీతాఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కాసేపు గడిపిన తర్వాత తన నివాసానికి చేరుకున్నారు.. కుటుంబ సభ్యులు బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన అన్నారు.. బాధిత రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పారు.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు..
బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తన వివాహం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చి ఇంటర్వ్యూలో తాప్సీ తన కెరీర్, వివాహం గురించి మాట్లాడింది. తనకు గతేడాదే పెళ్లయిందని ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 2023 డిసెంబర్లో తాప్సీ తన ప్రియుడు, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను వివాహం చేసుకుట్లు తెలిపింది. వాస్తవానికి అందరూ తాప్సీకి మార్చి 23, 2024న వివాహం జరిగిందని అనుకుంటున్నారు. మథియాస్ బోను, తాప్సీ కొన్నేళ్లుగా లవ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది…
దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇంద్రప్రస్థ అపోలోలో చేర్పించారు. ఇంద్రప్రస్థ అపోలో శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఎల్‌కె అద్వానీని వైద్య నిర్వహణ, పరీక్షల కోసం ఐసీయూలో చేర్చారు.
అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. భార్య నికితను గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, తల్లి, సోదరుడిని ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కొన్ని రోజుల క్రితం నికితా, ఆమె కుటుంబం వేధింపులకు బరిచలేక ఆరోపిస్తూ.. టెకీ ఆత్మహ్య చేసుకున్న విషయం తెలిసిందే.
రామ మందిర నిర్మాణంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను ప్రధాని నరేంద్ర మోడీ గౌరవించారని.. కానీ తాజ్ మహల్ కోసం పనిచేసిన కార్మికుల చేతులు నరికేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో కార్మిక శక్తికి ఉన్న గౌరవాన్ని అభినందిస్తూ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలో జరిగిన వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూహెచ్‌ఈఎఫ్) వార్షిక సదస్సులో యూపీ ముఖ్యమంత్రి ప్రసంగించారు.