టాలీవుడ్ సీనియర్ సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అసలు ఒక స్టార్ సింగర్ ఇలా సడెన్ గా ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అందరూ ఆశ్చర్య పోయారు. తాజాగా కేపీహెచ్బీ పోలీసులు కల్పనా స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కేపీహెచ్‌బీ పీఎస్ కి చెందిన మహిళా ఎస్సైతో పాటు మరో ఎస్‌ఐ ఆస్పత్రికి వచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. కల్పన సంచనల విషయాలు వెల్లడించింది. పోలీస్ స్టేట్‌మెంట్ ప్రకారం.. కల్పన తన కూతురితో మాట్లాడిన తరువాత నిద్రమాత్రలు ఎక్కువ తీసుకుంది.
READ MORE: Karimnagar Graduate MLC: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ లో కొనసాగుతున్న ఎలిమినేషన్
“ఈనెల రెండో తారీఖున కొచ్చి వెళ్లి వచ్చాను. నా కూతురు కేరళలోనే ఉంటాను, హైదరాబాద్ కు రానని చెప్పింది. ఎంత అడిగినా తాను రానని చెప్పడంతో నిన్న కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చాను. రోజు తీసుకునే ట్యాబ్లెట్సే.. కాని మరో మూడు ఎక్కువ వేసుకున్నాను. మానసిక ప్రశాంతత కోసం ట్యాబ్లెట్ వేసుకునున్నాను. అదే టైంలో నా భర్త ఫోన్ చేయడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదంతా జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత 8 నిద్ర మాత్రలు వేసుకున్నాను. బాడీపెయిన్స్ రావడంతో పెయిన్ టాబ్లెట్స్ ని కూడా వేసుకున్నాను. ఆ తర్వాత నా భర్తకి ఫోన్ చేసి నేను ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నానో తెలియదని చెప్పాను. ఆందోళనతో విల్లా సెక్రటరీకి నా భర్త ప్రసాద్ ఫోన్ చేశాడు. భర్త ప్రసాద చెప్పడంతో విల్లా సెక్రటరీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.” అని కల్పన పేర్కొంది.
READ MORE: RT 75 : రవితేజ.. BVSరవి.. కిషోర్ తిరుమల.. కాంబోలో సినిమా ఫిక్స్..