మారుతీ తన డిసెంబర్ 2024 అమ్మకాల డేటాను విడుదల చేసింది. గత నెలలో కంపెనీ రికార్డు స్థాయిలో 2,52,693 యూనిట్లను విక్రయించింది. ఈ రికార్డు విక్రయంలో దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాన్ సెగ్మెంట్ అయిన ఈకో కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. వాస్తవానికి.. గత నెలలో ఈకో 11,676 యూనిట్లు విక్రయం జరిగింది. గతేడాది డిసెంబర్లో 10,034 యూనిట్లు అమ్ముడయ్యాయి. విశేషమేమిటంటే..
యుజ్వేంద్ర చాహల్, భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్. ఐపీఎల్లో తన మాయాజాలంతో ఆకట్టుకుంటారు. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. చాహల్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆగస్టు 2023లో ఆడాడు. తాజా మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు చాహల్‌ను కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు మారడంతో చాహల్ అభిమానుల్లో సరికొత్త ఆసక్తి రేకెత్తించాడు.
నాంపల్లి కోర్టుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి చేరుకున్నారు. సంధ్య థియోటర్ ఘటనలో నిన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మళ్లీ కోర్టుకు చేరుకున్న ఐకాన్ స్టార్ రెగ్యులర్ బెయిల్‌కి సంబంధించి ష్యూరిటీలు సమర్పించారు. మేజిస్ర్టేట్ ఎదుట పత్రాలపై సంతకం చేసి.. ష్యూరిటీలు సమర్పించారు. కోర్టు తీర్పు ప్రకారం.. యాభై వేల రూపాయల డిపాజిట్ తో పాటు రెండు పూచీకత్తులను సమర్పించారు.
డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా వెల్లడైంది. ఈ జాబితాలో మరోసారి మారుతీ సుజుకీ కార్ల ఆధిపత్యం కనిపించింది. మారుతీ సుజుకీకి చెందిన బ్రెజ్జా డిసెంబర్ 2024లో 17,336 యూనిట్లు అమ్ముడైంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది! స్విఫ్ట్, ఎర్టిగా, వ్యాగన్ఆర్ వంటి కార్లను వెనక్కి నెట్టేసింది. అయితే.. డిసెంబర్ లో విక్రయించిన టాప్ 5 మోడల్‌లు 15వేల మార్కును దాటాయి. వీటిలో తేడా చాలా తక్కువగా ఉంది.
తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి ఓ వ్యక్తి చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. తన ప్రియురాలిని ఎలాగైనా మెప్పించాలని సంకల్పించాడు. దీని కోసం సింహాల బోనులోకి ప్రవేశించాడు. కానీ సింహాలకు అది అస్సలు నచ్చలేదు. సింహాలు ఆ వ్యక్తిపై దాడి చేసి చంపాయి. ఆ వ్యక్తికి సంబంధించిన చివరి క్షణాల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉజ్బెకిస్థాన్ పార్కెంట్లోని ప్రైవేట్ జూలో ఈ ఘటన జరిగింది.
అలోవెరా చర్మ సంరక్షణకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మం చికాకును తగ్గించడం, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అలోవెరా జెల్ ముఖంపై అప్లై చేయడం ద్వారా తాజాదనం, గ్లో పెరుగుతుంది. అయితే పచ్చి కలబంద జెల్ అందరికీ పడదు. ఈ జెల్‌ని డైరెక్ట్‌గా అప్లై చేయడం వల్ల కొందరికి సమస్యలు పెరుగుతాయి. నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల దుష్ప్రభావాలు ఏర్పడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం… అలర్జిక్ రియాక్షన్: కలబందలో ఉండే లాటెక్స్ కొంతమందికి చర్మంపై అలెర్జీకి […]
జుట్టు సంరక్షణ కోసం సహజమైన వస్తువులను ఉపయోగించాలి. జుట్టు పెరుగుదలకు గుడ్డు ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపిక. గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును ఒత్తుగా, బలంగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడతాయి. జట్టు రాలడాన్ని నివారిస్తాయి. కానీ.. జుట్టు పెరుగుదల విషయంలో గుడ్డులోని పచ్చసొన లేదా తెల్లసొన దానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది? అని ఆలోచిస్తుంటారు. ఈ రెండింటి వల్ల కూడా లాభాలు ఉన్నాయి. ఇది మీ జుట్టు…
మంత్రి శ్రీధర్ బాబుకు మరో కీలక బాధ్యత వరించింది. ‘తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ’ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు నియమితులయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మార్చాలని కంకణం కట్టుకున్నారని తెలిపారు.
చలికాలం ప్రారంభమైంది. రోజు రోజుకూ ఊష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అయితే ఈ చలిలో మనకు కారం.. కారంగా, వేడివేడిగా ఏదైనా తినాలని అనిపిస్తుంది. చాలా మంది ప్రజలు తరచుగా జంక్ ఫుడ్‌ను తింటుంటారు. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారం కంటే.. శరీరానికి ఉపయోగపడే రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీ తెలంగాణా వాసులు, ముఖ్యంగా హైదరాబాదీలకు సుపరిచితమే.
మనలో చాలా మంది అమెజాన్ రైన్ ఫారెస్ట్ పేరు వినే ఉంటారు. ప్రపంచంలోనే ది లార్జెస్ట్ ఫారెస్ట్ ఇదే. బేసిక్ గా ఎక్కడైనా దేశంలో అడివి ఉంటుంది. ఇక్కడ మాత్రం అడివిలోనే దేశం.. సారీ దేశాలు ఉన్నాయి. ఒక్క అమెజాన్ రైన్ ఫారెస్ట్ 9 దేశాలలో విస్తరించింది. బ్రెజిల్, పెరు, కొలంబియా, బొలివియా, ఈక్వడార్, ఫ్రెంచ్ గినియా, గినియా, సురినామ్, వెనుజుల. అందులో 60% బ్రెజిల్ లో ఉంది. అమెజాన్ అడవి ఎంత పెద్దదంటే సైజులో మన […]