మారుతీ సుజుకి 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాను విడుదల చేసింది. అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాగన్ఆర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ డేటా ప్రకారం.. జనవరి నుంచి డిసెంబర్ వరకు 1.98 లక్షల యూనిట్ల వ్యాగన్ఆర్ లను విక్రయించారు. అయితే కంపెనీకి చెందిన కార్లు ఏవీ 2 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును దాటలేకపోయాయి. విశేషమేమిటంటే.. వ్యాగన్ఆర్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కూడా అయ్యే అవకాశం ఉంది! అయితే.. ఈ జాబితా ఇంకా విడుదల కాలేదు. మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, హ్యుందాయ్ ఐ10, హ్యుందాయ్ ఐ20, టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్ వంటి ఇతర మోడల్‌ల అమ్మకాలు స్వల్పంగా మందగించాయి.
READ MORE: Rythu Bharosa: రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం..
మారుతీ సుజుకికి చెందిన వ్యాగన్ఆర్ కొత్త వర్షన్ 2019లో ప్రారంభించారు. ఆ తర్వాత కంపెనీ అందులో రెండు ఇంజన్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. 1.0-లీటర్ నుంచి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కు అప్డెట్ చేశారు. కాగా.. ఇటీవల కంపెనీ ఈ వ్యాగన్‌ఆర్ వాల్ట్జ్ ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ. 5.65 లక్షల్లోనే అందుబాటులో ఉందని సంస్థ ప్రకటించింది. బడ్జెట్లో ఉన్న ఇతర లైనప్స్‌తో పోల్చితే ఇది తక్కువే అని చెప్పొచ్చు. ఇది లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్స్‌తో పాటుగా కొత్త ఫీచర్లను అప్‌గ్రేడ్ చేసి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఎడిషన్‌ను LXi, VXi, ZXi వేరియంట్లలో కొనుగోలు చేసేందుకు వీలుంది. ఫ్రంట్ క్రోమ్ గ్రిల్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బాడీ సైడ్ మోల్డింగ్, ఫాగ్ ల్యాంప్స్ వంటి సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. క్యాబిన్లోనూ కొత్త ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ ఉంది.
READ MORE: Boney Kapoor: “అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదు”.. బాలీవుడ్ నిర్మాత కీలక వ్యాఖ్యలు
ముఖ్యంగా సరికొత్త డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్, సీట్ కవర్స్ అందించారు. రివర్స్ పార్కింగ్ కెమెరా, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్, స్పీకర్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూసినట్లయితే ఏబీఎస్‌తో పాటు డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌సీ, ఈబీడీ, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్ 1.0 లీటర్, 1.2 లీటర్ k- సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది. 66 Bhp, 8.9 mm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ సీఎన్‌జీ వేరియంట్లో కూడా అందుబాటులో ఉంది. ఇక మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ మోడల్స్ కూడా తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మంచి మైలేజీ వస్తుందని చెప్పొచ్చు. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్స్ లీటర్‌పై 24.35 కి.మీ. మైలేజీ, పెట్రోల్- AMT వేరియంట్ అయితే లీటర్‌కు 25.19 కి.మీ. మైలేజీ అందిస్తుంది.