హ్యుందాయ్ క్రెటా తన మునుపటి అమ్మకాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఇది మాత్రమే కాదు.. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఇది అవతరించింది. ఈ విభాగంలో బలమైన పోటీ ఉన్నప్పటికీ.. ఇది 2024 సంవత్సరంలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైదర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, ఎమ్‌జీ ఆస్టర్ వంటి మోడల్‌లు ఉన్నాయి. అయితే.. హ్యుందాయ్ క్రెటా వాటన్నింటినీ అధిగమించగలిగింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 11 లక్షల నుంచి రూ. 20.45 లక్షల మధ్య ఉన్నాయి.
READ MORE: Maruti Suzuki: డిసెంబర్‌లో రికార్డు బద్దలుగొట్టిన మారుతీ సుజుకి.. ఎన్ని కార్లు అమ్మిందంటే?
2024లో విక్రయం..
2015 లో మొదటిసారి లాంచ్ అయిన హ్యుందాయ్ క్రెటా ఈ సెగ్మెంట్లో ఆధిపత్యం వహిస్తోంది. 2023లో 1,57,311 యూనిట్లను విక్రయించింది. ఆ సమయంలో ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. కాగా, 2024లో 1,86,919 యూనిట్లు విక్రయించి.. 18.8% వృద్ధిని పొందింది. జనవరి 2024లో మిడ్-లైఫ్ అప్‌డేట్, మార్చి 2024లో పెర్ఫార్మెన్స్-ఫోకస్డ్ మోడల్ (క్రెటా ఎన్ లైన్)ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రజాదరణ మరింత పెరిగింది. 2023లో క్రెటా నెలవారీగా సగటు అమ్మకాలు.. 13,109 యూనిట్లగా నమోదైంది. ఈ ఏడాది భారీగా పెరిగింది.
READ MORE: Dr. Shiva Rajkumar: క్యాన్సర్ తగ్గింది.. ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన శివ రాజ్ కుమార్
2024 హ్యుందాయ్ క్రెటా: వేరియంట్లు
కొత్త హ్యుందాయ్ క్రెటా మొత్తం ఏడు బ్రాడ్ వేరియంట్లలో లభిస్తుంది. 2024 క్రెటా ఇ, ఇఎక్స్, ఎస్, ఎస్ (ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్, ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లలో వస్తుంది.