ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభమైంది. 18వ సీజన్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బారిలోకి దిగిన కోల్‌కతా (174) పరుగులు సాధించింది. బెంగళూరు విజయం కోసం (175) పరుగులు సాధించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రహానే (56) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సునీల్ నరైన్ ఔట్(44) టీంకి అండగా నిలిచాడు. అనంతరం రఘువంశీ 30 పరుగులు సాధించాడు.
మొదట కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సునీల్ నరైన్, క్వింటన్ డికాక్ బ్యాటింగ్ ప్రారంభించారు. తొలి ఓవర్‌లోనే కోల్‌కతా వికెట్ కోల్పోయింది. క్వింటన్ డికాక్(4).. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అయిదో బంతికి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రహానే, నరైన్ ఇన్నింగ్స్ బాధ్యత తీసుకున్నారు. దూకుడుగా పెంచిన అజింక్య రహానే.. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం.. రహానే, నరైన్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇద్దరూ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరుకుంది. రసిఖ్ సలామ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జితీశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి సునీల్ నరైన్ ఔట్(44) ఔట్ అయ్యాడు. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో రసిఖ్ సలామ్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ అజింక్య రహానే ఔట్ (56) వెనుదిరిగాడు. వెంటనే కృనాల్ పాండ్య బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ (6) బౌల్డ్ అయ్యాడు.
బరిలోకి దిగిన రఘువంశీ, రింకుసింగ్ కుదురుకుంటుండగా.. మరో దెబ్బ పడింది. కృనాల్ పాండ్య 15 ఓవర్‌లో చివరి బంతికి రింకు సింగ్ (12) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్ (4)ను సుయాశ్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. బౌలింగ్‌లో కృనాల్ అద్భుతంగా రాణించాడు. అద్భుతంగా రాణించిన రఘువంశీ (30) పెవిలియన్‌కు చేరుకున్నాడు. యశ్ దయాల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జోష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో హర్షిత్‌రాణా (5) ఓట్ అయ్యాడు. అటు.. కృనాల్ పాండ్య మూడో వికెట్ పడగొట్టాడు. జోష్ హాజెల్‌వుడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సుయాష్ శర్మ , రసిఖ్ దార్ సలాం, యశ్ దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.