త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిసింది. 2023 అక్టోబర్ 26 న గవర్నర్‌గా నియామకమయిన ఇంద్రసేనారెడ్డి. నిన్న ఇంద్రసేనా రెడ్డి వ్యక్తి గత సహాయకుడు విచారణకు హాజరయ్యారు.
READ MORE: Rajya Sabha Members: రాజ్యసభ రాజకీయం.. విజయసాయిరెడ్డి రాజీనామాతో కొత్త చర్చ..!
గత ఏడాది డిసెంబర్ లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన సమయంలో ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్క్ లను డీఎస్సీ ప్రణిత్ రావు బృందం ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న ఏ4 నిందితుడిగా ఉన్నారు. గత ఎనిమిది నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు.
READ MORE: Dead Body On Bicycle: సైకిల్‌పై 15 కి.మీ. తల్లి మృత దేహాన్ని మోసుకెళ్లిన కొడుకు
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ ఓఎస్టీ ప్రభాకర్ రావు నేృతృత్వంలో పలువురు ప్రముఖులు, వ్యాపార వేత్తలు, రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడగా… ఈ కేసులో అప్పటి ఎస్ఐబీ అధికారులు ప్రణిత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్టీ రాధాకిషన్ రావులను అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిషీట్ సైతం దాఖలుచేశారు. అయితే, కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్ కుమార్ అమెరికాలో ఉండటంతో విచారణ మందగించింది. ప్రస్తుతం విచారణ జోరందుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు తెలిసింది.