మూసీ నిర్వాసితులకు ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మూసీ నిర్వాసితుల కోసం 37 కోట్ల 50 లక్షలు విడుదల చేసింది. మూసీ నుంచి ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్న వారికి ఖర్చుల కోసం రూ. 25 వేలు ఇస్తుంది. 15 వేల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున నగదు అందజేస్తోంది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నిధులు జారీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నిర్వాసితులు ఇండ్లు ఖాళీ చేసే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని…
గుంటూరులోని KL యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదు చేసింది.. యూనివర్సిటీ అధికారులు న్యాక్ (NAAC) అక్రిడేషన్ కోసం లంచాలు ఇచ్చిన ఘటనలో కేసు నమోదైంది. A++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లు సీబీఐ తేల్చింది. వర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ తో పాటు మొత్తం10మంది అరెస్ట్ చేసింది.. విశాఖ, ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు విజయవాడలోని కేఎల్‌యూ పరిపాలనా భవనం, వడ్డేశ్వరంలోని క్యాంపస్‌లో సోదాలు చేపట్టారు. నిన్న రాత్రి 10 గంటల […]
గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో కాల్పులు ఘటనపై కీలక విషయాలు వెల్లడయ్యాయి.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. నటోరియాస్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌పై ఇప్పటికే 80 కేసులు ఉన్నట్లు గుర్తించారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో16 కేసులో మోస్ట్ వాంటెడ్ గా ప్రభాకర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిషన్ బాగ్ కార్పోరేటర్, కాలాపత్తర్ ఇన్స్పెక్టర్, బహదూర్ పురా పోలీసులు వెంటనే స్పందించారు. కిషన్‌బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని ఓ బిల్డింగు సెల్లార్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అది కాస్త పైపునకు పాకింది. అగ్ని ప్రమాదం వల్ల భవనంపై అంతస్తు్ల్లోనూ దట్టమైన పొగ అలుముకుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఇంఛార్జి మంత్రులతో రేపు కూటమి నేతల సమావేశం జరగనుంది. ఆయా జిల్లాలో ఉన్న కూటమి నేతలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఇంఛార్జి మంత్రులు సమావేశమవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చ జరగనుంది.
ఎల్లుండి తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు.. మలయప్పస్వామి ఒకే రోజు సప్త వాహనాలుపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ ఉంటుంది. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనసేవ, ఉదయం 11 గంటలకు గరుడవాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ, మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు…
హిందూ మతంలోని ప్రత్యేక పండుగలలో వసంత్ పంచమి ఒకటి. వసంత పంచమి రోజున మహా కుంభమేళాలో నాలుగవ రాజస్నానం నిర్వహిస్తారు. వసంత పంచమి ఫిబ్రవరి 3న రానుంది. నాలుగవ రాజస్నానం రోజున బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.23 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. పవిత్ర నదుల్లో స్నానాలు కూడా ఆచరిస్తారు. అయితే వసంత పంచమినాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆ రోజు మర్చిపోయి కూడా కొన్ని పనులు చేయకూడదు. ఈ నేపథ్యంలో వసంత పంచమి రోజు ఏయే పనులు…
అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేతో రూపొందిన W/O అనిర్వేష్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ సాధిస్తుందని ఆర్పి పట్నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో నిర్మించిన సినిమా W/O అనిర్వేష్. ఈ సినిమాకు గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. నిర్మాతలు వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర సారథ్యంలో సినిమా నిర్మించారు. రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి తదితరులు ఈ చిత్రంలో నటించారు.
‘కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన సినిమా ‘సూర్యాపేట్ జంక్షన్’. ఈ చిత్రాన్ని యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ నిర్మించింది. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సినిమా "సంక్రాంతికి వస్తున్నాం". ఇందులోమీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేశారు. ఆడియో సూపర్ హిట్ కావడం, డిజిటల్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు.