ఎలాన్ మస్క్ టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీ భారతదేశానికి రాలేదు. అయితే, నివేదికల ప్రకారం.. కంపెనీ ఏప్రిల్ నుంచి భారతదేశంలో కార్లను అమ్మడం ప్రారంభిస్తుంది. ఆ కంపెనీ తన చౌకైన ఎలక్ట్రిక్ కారును భారత్‌లో విక్రయించేందుకు సిద్ధమవుతోంది. దీని ధర దాదాపు రూ. 21 లక్షలు ఉండవచ్చని అంచనా. ఇంతలో, ఎలక్ట్రిక్ ఫోర్- వీలర్ విభాగంలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై డిస్కౌంట్లు ప్రకటించింది.
ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో చెలరేగిన వివాదం మధ్య, కేంద్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కీలక సూచనలు చేసింది. ప్లాట్‌ఫామ్స్ ప్రవర్తనా నియమావళిని పాటించాలని కేంద్రం సూచించింది. ‘A’ రేటెడ్ కంటెంట్‌ను నిషేధించాలని తెలిపింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్లపై ఫిర్యాదులు అందాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐటీ రూల్స్‌లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్ గురించి ప్రస్తావించింది. సామాజిక మాధ్యమాలు, […]
ఛావా సినిమాని అందరూ తప్పకుండా చూడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.. నూతన విద్యావిధానాన్ని తీసుకువస్తే తెలంగాణలో అమలుకు నోచుకోవడం లేదన్నారు.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. "తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులది బిచ్చపు బతుకు అయ్యింది.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదనంగా జాతీయ విపత్తు నిర్వహణ నిధి (NDRF) నిధులను ఇవ్వనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా బుధవారం ఈ నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల కానున్నాయి. ఇందులో తెలంగాణ వాటా కింద రూ.231.75 కోట్లు అందనున్నాయి. గతేడాది ఆయా రాష్ట్రాలకు విడుదల చేసిన ఎన్బీఆర్ఎఫ్ నిధులకు..
కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు చాలా విస్తృతంగా సమావేశం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ నాటికి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఈ రోజు చాలా విస్తృతంగా, సుదీర్ఘంగా సమావేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మా పార్టీ ముఖ్యులు 30 మంది మాట్లాడారు. తెలంగాణకు ఏనాటికైనా బీఆర్ఎస్సే రక్షణ కవచం.. గతంలో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్…
ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్ లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అరెస్టు చేయవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావు నిందితుడిగా చేర్చారు. రియాల్టర్ చక్రధర ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగిన విషయం తెలిసిందే.
కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… " కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. ఐదు ఏండ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీకు ఉనికి లేదు. అందుకే కేసీఆర్ ఇలాంటి మెసేజ్ లు ఇస్తున్నారు.
ప్రజలను ఫైబర్ మోసాల నుంచి కాపాడడం తమ బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేంద్ర అన్నారు. HICC లో ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సైబర్ నేరాలు పెరిగిపోయాయని.. సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇటీవలే రాష్ట్రంలో దేశంలో వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. చాలామంది అమాయకులు మోస పోతున్నారన్నారు.
నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయని బాంబు పేల్చారు. "సిల్వర్ జూబ్లీ వేడుకలే ఇంపార్టెంట్. ఈ సీఎం ఇంతలా ప్రజల్లో వ్యతిరేకత ఇంత తొందరగా వస్తుందనుకోలేదు.
లాయర్లు గుండెపోటు ఘటనలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కోర్టు ఆవరణల్లో కుప్పకూలుతున్నారు. ఓ కేసుకు సంబంధించి తన క్లైయింట్ తరుఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ వేణుగోపాల్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న తోటి లాయర్లు, కోర్టు సిబ్బంది హాస్పిటల్‌కు తరలించే లోపే మార్గమధ్యలో మృతి చెందారు. ఇటీవల తెలంగాణ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది..