ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. కరాచీలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్థాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. ఇక, భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీ మార్చి 9 వరకు కొనసాగుతుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న మొదటి ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఇది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కష్టాలు పెరిగాయి. సత్యేంద్ర జైన్‌పై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన ఫైల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు . రత పౌర రక్షణ నియమావళిలోని సెక్షన్ 218 కింద 60 ఏళ్ల జైన్‌పై కేసు నమోదు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని అనుమతి కోరింది.
బైక్, కారు, బస్సు, జీప్, ట్రక్, విమానం అన్నింటికీ వేర్వేరు ఇంధనం అవసరం. బైక్‌లు పెట్రోల్‌తో నడుస్తాయి. మారుతున్న కాలానుగుణంగా మార్కెట్లో ఈవీ, సీఎన్జీ బైక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ.. డీజిల్ తో నడిచే బైక్స్ మాత్రం మార్కెట్లో లేవు. అసలు డీజిల్ ఇంజిన్లను బైక్స్‌కు ఎందుకు అమర్చరు? ఒక వేళ తయారు చేసి మర్చితే ఎలాంటి సమస్యలు వస్తాయి? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం.. READ MORE: Big twist in Vallabhaneni […]
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇటీవలి తొక్కిసలాట సంఘటనలను ఉటంకిస్తూ.. మహా కుంభ్‌ను 'మృత్యు కుంభ్' అన్నారు. ఈ కుంభమేళాలో వీఐపీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని.. పేదలు దానికి సౌకర్యాలు కరువయ్యాయన్నారు.
ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రిలియా భారతదేశంలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. కొత్త మోటార్‌సైకిల్ టువోనో 457ను అధికారికంగా విడుదల చేసింది. ఇది భారత మార్కెట్లో అత్యంత చౌకైన అప్రిలియా బైక్! దీని ప్రారంభ ధర రూ. 3.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.
విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ కలిసిన విషయం తెలిసిందే. విజయవాడలో మాజీ సీఎంను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంతలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జల్లికట్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ నటుడు, టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు మనోజ్‌కు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్‌ను ఆహ్వానించారు. హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరవడంతో.. యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని, గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. మనోజ్ కూడా సంతోషం వ్యక్తం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మూడు సైన్ చేశారు. అందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అప్పట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాయి. ఖచ్చితంగా హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’కు మించి ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. కాగా.. ప్రస్తుతం పవన్ సినిమాలకు కాకుండా…
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, రాజమండ్రి శ్రీదేవి ప్రధాన పాత్రల్లో సూర్య వంటిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘నారి’. శశి వంటిపల్లి నిర్మించారు. కేదార్ శంకర్, ప్రమోదినీ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. షి ఫిల్మ్స్, హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మించారు. గతంలో ఈ చిత్ర టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ను తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్‌ను ఆమె మెచ్చుకున్నారు.
ఓ మహిళ కదల్లేని పరిస్థితిలో ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వైద్యం చేయలేదు. ఆధార్ కార్డు లేని కారణంగా.. బాధితురాలిని గెంటేశారు. ఆమె పరిస్థితి చూసి కనికరం చూపించలేదు. ఆమె వెంట తన కుమార్తె ఉంది. పొట్ట చేత పట్టుకుని పల్లె నుంచి పట్నం వచ్చిన మహిళ ఆస్పత్రి వద్ద వైద్యం అందించాలని ప్రాధేయపడింది.