-
R Krishnaiah: బీసీలను ఓటు వేసే యంత్రాల్లా చూస్తున్నారు.. తప్ప సీట్లు ఇవ్వడం లేదు..
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. -
Komati Reddy Venkat Reddy: ఆర్&బీ అధికారులపై మంత్రి ఆగ్రహం.. రోడ్ల రిపేర్లు చేపట్టాలని ఆదేశం
ఆర్ & బీ రివ్యూలో అధికారుల పని తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్ర మత్తు వీడి రోడ్ల రిపేర్లు చేయాలని ఆదేశించారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రిపేర్లు చేయకుండా మీనమేషాలు లెక్కించడం ఏంటి? అని ప్రశ్నించారు. -
Konda Surekha: విభజించి పాలించే మనస్తత్వం ఉన్న పార్టీ బీజేపీ.. కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు
విభజించి పాలించే మనస్తత్వం బీజేపీదని.. అది ఓ మతతత్వ పార్టీ అని మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని విమర్శించారు. ప్రజల అవసరాల కోసం ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఎప్పుడు పాటుపడలేదని ఆరోపించారు. -
Bhatti Vikramarka: కుల గణన వల్ల జరిగే ప్రయోజనాలు ఇవే.. భట్టి విక్రమార్క స్పష్టం
కుల గణనపై ఎన్నికలకు ముందే.. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చెప్తున్నారని.. కుల గణనతో వనరులు, ఆస్తులు సమానంగా అందాలీ అనేది తమ విధానమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఐనా కొద్ది మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారికి మాత్రమే ఫలాలు అందాలని అనుకునే వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సమగ్ర సమాచారం వస్తే.. సంపద ఇంకా ఎంత మందికి అందలేదు అనేది తెలుస్తుందని చెప్పారు. -
VH Hanumanthu Rao: రాహుల్ గాంధీ కులం ఇదే.. బీజేపీకి వీహెచ్ కౌంటర్
బీజేపీ నేతల మాటలకు మాజీ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అని బీజేపీ నేతలు అంటున్నారని.. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతురావు అన్నారు. రాహుల్ గాంధీ కులగణన చేసి దేశంలోని అన్ని కులాలకు న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రధాని మోడీ మాత్రం కులాల మధ్య రాహుల్ గాంధీ చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. -
UP: రీల్స్ మోజులో కుమార్తెను నీటిలో వదిలేసిన తల్లి.. నీట మునిగి చిన్నారి మృతి(వీడియో)
యూపీ రాష్ట్రం ఘాజీపూర్‌లోని సైద్పూర్ నగరంలో పక్కా ఘాట్ వద్ద ఐదేళ్ల అమాయక చిన్నారి తన తల్లి ఎదుట గంగా నదిలో మునిగి మృతి చెందింది. మునిగిపోతున్న బాలికను చూడకుండా తల్లి మొబైల్‌తో రీలు తీస్తోంది. యువతి నీటిలో మునిగిన వీడియో కూడా రికార్డ్ చేయబడింది. స్థానిక డైవర్ సహాయంతో రెండు గంటల తర్వాత బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
PM Modi: కెనడాలో హిందూ ఆలయాలపై దాడి.. స్పందించిన ప్రధాని మోడీ..
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం నాడు ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కర్రలతో ఆలయంపై దాడి చేసి మతపరమైన వాతావరణాన్ని భంగపరిచారు. ఈ సంఘటన తర్వాత.. కెనడాలోని భారతీయ సమాజంలో ఆందోళన పెరిగింది. ఈ ఘటనపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోడీ.. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్ దృఢ సంకల్పాన్ని బలహీనపరచవని స్పష్టం చేశారు. -
Delhi: మహిళా రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి కోర్టు సమన్లు..
రెజ్లింగ్ అసోసియేషన్‌లో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో హాజరు కానందుకు బాధితురాలు సాక్షికి కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 14 లోగా కోర్టులో సాక్ష్యాలను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో గతంలో కూడా బాధితురాలికి సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె దేశంలో లేరని, అందుకే ఇక్కడికి రాలేనని బాధితురాలి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. వచ్చే నెలలో జరిగే ఛాంపియన్‌షిప్‌కు హాజరయ్యేందుకు సాక్షి విదేశాలకు వెళ్లారని చెప్పారు. -
Mangaluru: ఇదెక్కడి మాస్ రా మావా.. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లను మభ్యపెట్టి.. రూ.1.29 కోట్ల దోపిడీ..
అమెజాన్ ద్వారా కొత్త మార్గంలో మోసం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. మంగళూరులోని ఉర్వా పోలీసులు ఇద్దరు రాజస్థాన్ వాసులను అరెస్ట్ చేశారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి రూ.1.29 కోట్ల విలువైన వస్తువులను దొంగిలించి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాజస్థాన్‌కు చెందిన రాజ్‌కుమార్ మీనా, సుభాష్ గుర్జర్లు గత కొన్ని నెలలుగా పలు రాష్ట్రాల్లో అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లను మోసం చేస్తున్నారు. -
Waqf Bill: ఇలా చేస్తే జేపీసీ నుంచి తప్పుకుంటాం.. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపీలు..
వక్ఫ్ (సవరణ) బిల్లుపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాయి. తాము జేపీసీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని విపక్ష ఎంపీలు హెచ్చరించారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును పరిశీలించే బాధ్యతను జగదాంబిక పాల్ నేతృత్వంలోని జేపీసీకి అప్పగించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!