ఎలాన్ మస్క్ టెస్లా ఎలక్ట్రిక్ కంపెనీ భారతదేశానికి రాలేదు. అయితే, నివేదికల ప్రకారం.. కంపెనీ ఏప్రిల్ నుంచి భారతదేశంలో కార్లను అమ్మడం ప్రారంభిస్తుంది. ఆ కంపెనీ తన చౌకైన ఎలక్ట్రిక్ కారును భారత్‌లో విక్రయించేందుకు సిద్ధమవుతోంది. దీని ధర దాదాపు రూ. 21 లక్షలు ఉండవచ్చని అంచనా. ఇంతలో, ఎలక్ట్రిక్ ఫోర్- వీలర్ విభాగంలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. టాటా కంపెనీ ఇటీవలే దేశంలో 2 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా కంపెనీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుంది.
READ MORE: Yuzvendra Chahal: క్లిష్ట పరిస్థితుల నుండి రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు.. పోస్ట్ వైరల్
టాటా మోటార్స్ భారతదేశంలో 5 ఎలక్ట్రిక్ మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో టియాగో EV, టిగోర్ EV, పంచ్ EV, నెక్సాన్ EV, కర్వ్ EV ఉన్నాయి. దీని ధరలు రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం 2024లో టాటా మోటార్స్ 61,496 యూనిట్ల అమ్మకాల జరిపింది. టాప్ ఎలక్ట్రిక్ వాహన సంస్థగా రికార్డు సృష్టించింది. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కంపెనీ తన రాబోయే మోడళ్లను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో హారియర్ EV, సియెర్రా EV కూడా ఉన్నాయి. రెండూ వాటి పూర్తి-ఎలక్ట్రిక్ అవతార్‌లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.
READ MORE: Yuzvendra Chahal: క్లిష్ట పరిస్థితుల నుండి రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు.. పోస్ట్ వైరల్
టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్‌లపై టెస్లా కన్నేసింది..
టెస్లా భారతదేశానికి వస్తున్నట్లు కొన్ని నివేదికలు వెలువడ్డాయి. షోరూమ్ కోసం ఢిల్లీ, ముంబైలలో కొన్ని ప్రదేశాలను ఎంచుకుంది. టెస్లా నియామకాలు చేపడుతోంది. అందులో టెస్లా తన భారత్‌లో వ్యాపారాన్ని ప్రారంభించేదుకు టాటా మోటార్స్‌కి చెందిన ఎగ్జిక్యూటివ్‌లపై కన్నేసినట్లు పేర్కొన్నాయి. టాటా కార్యనిర్వాహకుల కోసం వెతుకుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి.