ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో చెలరేగిన వివాదం మధ్య, కేంద్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కీలక సూచనలు చేసింది. ప్లాట్‌ఫామ్స్ ప్రవర్తనా నియమావళిని పాటించాలని కేంద్రం సూచించింది. ‘A’ రేటెడ్ కంటెంట్‌ను నిషేధించాలని తెలిపింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌లపై ఫిర్యాదులు అందాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐటీ రూల్స్‌లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్ గురించి ప్రస్తావించింది. సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఐటీ రూల్స్‌లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఈ నిబంధనలు ఉల్లంఘించొద్దని హెచ్చరించింది. వయస్సు ఆధారంగా కంటెంట్‌ను వర్గీకరించాలని పేర్కొంది. ఓటీటీలు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని ప్రకటన ద్వారా తెలిపింది.
READ MORE: Eaknath Shinde : ఏక్‌నాథ్ షిండేకు హత్యా బెదిరింపు.. కారును బాంబుతో పేల్చేస్తామని హెచ్చరిక
కాగా.. యూట్యూబర్, కమెడియన్ సమయ్ రైనా నిర్వహించే కార్యక్రమం ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రజాదరణతో పాటు అనేక వివాదాలు ఈ కార్యక్రమాన్ని చుట్టుముట్టాయి. ఈ షోకు సంబంధించిన ఒక ఎపిసోడ్‌లో యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా చేసిన ఒక వ్యాఖ్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ వ్యాఖ్య చేస్తూ ఆయన ఉపయోగించిన భాష చాలా అసభ్యకరంగా ఉందని విమర్శిస్తున్నారు. యూట్యూబర్లు ఆశిష్ చంచలానీ, అపూర్వ మఖిజా కూడా ఈ షోలో కనిపించారు. రణ్‌వీర్ ఆ షోలో పాల్గొన్న ఒక ప్రెజెంటర్‌ని, ఆయన కుటుంబం గురించి అభ్యంతరకరమైన ప్రశ్న అడిగారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత, ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షోలోని ఆ ఎపిసోడ్‌ను బ్లాక్ చేశారు. రణ్‌వీర్ అభ్యంతరకర వ్యాఖ్య చేసిన ఎపిసోడ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ వివాధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి నియమాలను గుర్తు చేసింది.
READ MORE: Vishwak Sen: లైలా దెబ్బ.. ఇక నా సినిమాల్లో అసభ్యత ఉండదు.. విశ్వక్ సేన్ కీలక ప్రకటన