ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. కమిటీలకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు.
శ్రీశైలంలో అన్య మతస్థులకు షాపులు కేటాయించ వద్దన్న జీవో నెంబర్ 425పై స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీశైలం దేవస్థానం ప్రాంతంలో అన్య మతస్థులకు దుకాణాలు కేటాయించ వద్దని 2015లో ప్రభుత్వం జీవో 425 జారీ చేసిన విషయం తెలిసిందే. జీవో 425 ను సవాల్ చేస్తూ పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు 2020లో జీవోపై స్టే విధించింది. స్టే విధించినప్పటికీ ప్రభుత్వం మళ్లీ టెండర్లను పిలిచింది. దాంతో పలువురు దుకాణదారులు మళ్లీ సుప్రీంకోర్టును…
బర్డ్ ఫ్లూ గోదావరి జిల్లాలను వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ పేరు చెప్తేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కోళ్లకు సోకిన ఈ వైరస్.. కొన్ని రోజుల్లోనే లక్షలాది కోళ్లను బలి తీసుకుంది. ఈ కోళ్లను పరీక్షించిన భూపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబ్ రిపోర్ట్ సైతం.. దీనిని బర్డ్ ఫ్లూ వైరస్గా నిర్ధారించింది. ఈ వైరస్ కోళ్ల నుంచి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్లు ప్రకటించింది.
భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే ఛత్రపతి శివాజీ జయంతి నేడు. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ గొప్ప యోధుడు. అలాంటి యోధుడి జన్మధినాన్ని భారత్లో ఘనంగా జరుపుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో ఇదో పెద్ద పండుగ. మాస్టర్ స్ట్రాటజిస్ట్గా పేరుగాంచిన ఛత్రపతి శివాజీ మొఘలులపై అనేక యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని రూపొందించాడు.
సాంబారును మొట్టమొదటిసారిగా ఎక్కడ తయారైంది అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. తంజావూరును పాలించిన మరాఠీ పాలకుల వంటశాలలో తయారు చేశారనే సమాధానం వినిపిస్తుంది. ఛత్రపతి శివాజీ సవతి తమ్ముడు వ్యాంకోజీ తంజావూరును పాలించాడు. ఆయన 1683లో మృతి చెందాడు. వ్యాంకోజీ కుమారుడు షాహాజీ భోంస్లే. ఆయన మరణానంతరం 1684లో షాహాజీ సింహాసనాన్ని అధిష్టించాడు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ స్పందించింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన దురదృష్టకర సంఘటనపై జరుగుతున్న విచారణకు సంబంధించి తప్పుదారి పట్టించేలా కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయని పేర్కొంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై RPF విచారణ అంటూ ఇవాళ తప్పుదారి పట్టించారని.. రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై నార్త్ రైల్వే ఇప్పటికే ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించింది.
భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు వింటే హిందూ యువతకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మెఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. తల్లి సంరక్షణలో బైరంఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజపుర, గోల్కొండ సుల్తానులు, మొఘలులకు ముచ్చెమటలు పట్టించాడు.
ఎల్లుండి రాంలీల మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే దానిపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది.
మహా కుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక పండుగ. ప్రారంభమైన తొలి రోజే నుంచి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నో వింతలు, విశేషాలు,మరెన్నో ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ప్రయాగ్ రాజ్ వెళ్లిన భక్తులకే కాదు.. టీవీల ముందు కూర్చుని చూసినోళ్ల గుండెల్లో భక్తిపారవశ్యం ఉప్పొంగుతోంది. కాగా.. తాజాగా కుంభమేళాలో స్నానమాచరించిన భక్తుల సంఖ్యను యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు 55 కోట్ల మంది మహా కుంభమేళాలో స్నానం చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
మహిళల్లో క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మహిళలను వేధిస్తున్న క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ అన్నారు. తొమ్మిది నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు అందిస్తామన్నారు.